ETV Bharat / sitara

కరోనా తీవ్రత తగ్గిన వెంటనే #ప్రభాస్20 అప్​డేట్స్

author img

By

Published : Apr 7, 2020, 1:55 PM IST

హీరో ప్రభాస్ కొత్త సినిమా అప్​డేట్స్​పై స్పష్టతనిచ్చింది నిర్మాణసంస్థ యూవీ క్రియేషన్స్. ఈ వైరస్​ తీవ్రత తగ్గిన వెంటనే వాటిని అభిమానులతో పంచుకుంటామని ట్వీట్ చేసింది.

కరోనా తీవ్రత తగ్గిన వెంటనే #ప్రభాస్20 అప్​డేట్స్
హీరో ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం ఓ పీరియాడికల్ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ దర్శకుడు. ఇటీవలే జార్జియాలో ఓ షెడ్యూల్​ పూర్తి చేసుకుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత చిత్రబందమంతా, హోం క్వారంటైన్​లో ఉంది. అయితే టైటిల్​, ఫస్ట్​లుక్​ గురించి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంపై అభిమానులు కోపంగా ఉన్నారు. ఈ విషయమై తాజాగా ట్వీట్ చేసింది నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్.

ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని తాత్కాలికంగా ఆపేశామని, కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మరిన్ని అప్​డేట్స్​ పంచుకుంటామని చెప్పింది చిత్రబృందం. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని కోరింది.

production house uv creations tweet about prabhas20
నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ట్వీట్

ఈ సినిమా కోసం 'ఓ డియర్', 'రాధే శ్యామ్' అనే పేర్లను ఇప్పటికే రిజిస్టర్​ చేయించారు. కానీ వీటిలో ఏది ఇంకా ఖరారు చేయలేదు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.