ETV Bharat / sitara

Radheshyam story: ప్రభాస్​ 'రాధేశ్యామ్​' కథ లీక్​! - prabhas radhe shyam song

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్​, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, తొలి పాట సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి(prabhas radhey shyam song). ఈ క్రమంలోనే సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ కథ ప్రచారంలో ఉంది. ఇంతకీ స్టోరీ ఏంటంటే?​

radheshyam story
రాధేశ్యామ్
author img

By

Published : Nov 21, 2021, 6:33 PM IST

Updated : Nov 21, 2021, 7:39 PM IST

ప్రభాస్​, పూజ హెగ్డే కాంబినేషన్​లో రిలీజ్​కు సిద్ధమవుతున్న సినిమా 'రాధేశ్యామ్​'(prabhas radhey shyam movie). 'సాహో' తర్వాత ప్రభాస్​ హీరోగా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్​, యానిమేటెషన్​తో వచ్చిన తొలి పాట 'ఈ రాతలే' ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే తొలి పోస్టర్​ విడుదలైనప్పటి నుంచి 'రాధేశ్యామ్'​ స్టోరీ(radheyshyam story) ఇదేనంటూ చర్చించుకోవడం ప్రారంభించారు అభిమానులు. కొంత మంది పునర్జన్మల కథ, ఇంకొంత మంది టైమ్‌ ట్రావెల్‌ అని ఏవేవో ఊహించుకున్నారు. ఇక 'ఈ రాతలే' వీడియో సాంగ్​ రిలీజ్​ అయినప్పటి నుంచి ఓ మిస్టరీ ట్రైన్​ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోందని, కథ ఇదేనంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే?

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1970లో యూరప్‌ నేపథ్యంగా సాగే ప్రేమకథ ఇది(prabhas upcoming movie radhe shyam). ఇందులో ఓ హాస్పిటల్‌లో ప్రేరణ(పూజా హెగ్డే) పని చేస్తున్నప్పుడు ప్రమాదంలో గాయపడ్డ విక్రమాదిత్యను(ప్రభాస్​,) అక్కడికి తీసుకొస్తారు. ఆస్పత్రిలో ఆమె సేవలు, మనసును చూసి ప్రేమలో పడతారు విక్రమ్​. అయితే.. పామిస్ట్ అయిన విక్రమాదిత్యకు ప్రేరణ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ముందే తెలిసిపోతుంది. ఆమెకు ఓ పెద్ద ముప్పు పొంచి ఉందని అర్థమవుతుంది. అప్పటి నుంచి ప్రేరణ వెంటే ఉండి కాపాడుకుంటూ, ఆమె ప్రేమను విక్రమ్ ఎలా పొందారు అనేది కథ.

అయితే కథలో అసలు ట్విస్ట్​ అక్కడే ఉందట. రాధేశ్యామ్​ కథలో పునర్జన్మల నేపథ్యమూ ఉందట. ప్రభాస్​కు ఇంటర్వెల్​ ముందు తన గతం గుర్తుకు వస్తుంది. ఆ సమయంలోనే తను, తన ప్రేయసి చావు వెనుక ఓ మిస్టరీ ఉందని కనిపెడతారు. ఆ మిస్టరీ ఏంటన్న దాన్ని కనుగొనేందుకు హీరో చేసే ప్రయత్నాలతోనే ఈ సినిమా నడుస్తుందని తెలుస్తోంది.

కొన్నేళ్ల క్రితం 106మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ రైలు ఓ సొరంగంలోకి వెళ్లగానే మాయమైపోతుందట. ఆ తర్వాత సదరు ప్రయాణికులు చనిపోయినట్లు అక్కడి పత్రికల్లో వార్తలు వస్తాయి. వారిలో విక్రమాధిత్య, ప్రేరణ కూడా ఉంటారట. అసలు ఆ టన్నెల్​లో ఏం జరిగింది? ఎలా చనిపోయారు? అనేది ఈ సినిమాలో పెద్ద ట్విస్ట్​. ఆ చరిత్రను తిరగేసి ఆ ప్రమాదం వెనుక కారణాన్ని విక్రమాదిత్య కనిపెట్టడమే ఈ సినిమా కథాంశం.

ఈ చిత్రంలో ప్రభాస్​ పామిస్ట్​గా​(చేతి రేఖలు చూసి భవిష్యత్​ను చెప్పేవారు) కనిపించనున్నారు. భాగ్యశ్రీ, జయరామ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ దర్శకుడు(radhe shyam director). యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్​తో నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్, జపనీస్ భాషల్లో ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది(prabhas radheyshyam movie release date). సంక్రాంత్రికి ఈ చిత్రానికి పోటీగా 'భీమ్లానాయక్​'(జనవరి 12), 'ఆర్​ఆర్​ఆర్​'(జనవరి 7) కూడా రానున్నాయి.

ఇదీ చూడండి: 'ఈ పాటలోనే 'రాధేశ్యామ్' కథ ఉంది'

Last Updated : Nov 21, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.