ETV Bharat / sitara

ట్విట్టర్​లో ప్రభాస్ 'రాధే శ్యామ్' రికార్డు - ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా 'రాధే శ్యామ్' అనే చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా శుక్రవారం ఈ సినిమా ఫస్ట్​లుక్, టైటిల్ విడుదల చేయగా అది ట్విట్టర్​లో రికార్డు సృష్టించింది.

ప్రభాస్ 'రాధే శ్యామ్' ట్విట్టర్​ రికార్డు

author img

By

Published : Jul 11, 2020, 4:47 PM IST

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్'‌ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్​ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ లుక్, టైటిల్‌ పోస్టర్‌ విడుదలైన 24 గంటల్లోనే 6.3 మిలియన్ల ట్వీట్లతో, ట్విట్టర్‌లో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.

పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే 70 శాతంపైగా పూర్తయింది. ఈ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో జగపతిబాబు, సత్యరాజ్‌, భాగ్యశ్రీ, జయరాం, మురళీ శర్మ, ప్రియదర్శి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.