ETV Bharat / sitara

ఇటలీలో కేక్ కట్ చేసిన ప్రభాస్ - రాధేశ్యామ్ షూటింగ్

ప్రముఖ హీరో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఇటలీలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం 'రాధేశ్యామ్' చిత్రీకరణలో భాగంగా ఇటలీలో ఉన్న డార్లింగ్ అక్కడే చిత్రబృందంతో కలిసి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు.

Prabhas cutting Birthday Cake on the sets of RadheShyam in Italy
ఇటలీలో ప్రభాస్​ పుట్టినరోజు వేడుక
author img

By

Published : Oct 23, 2020, 11:03 PM IST

ప్రముఖ సినీ హీరో ప్రభాస్‌ పుట్టిన రోజు వేడుకలు ఇటలీలో ఘనంగా జరిగాయి. ప్రస్తుతం 'రాధేశ్యామ్‌' చిత్రం షూటింగ్‌లో భాగంగా ఇటలీలో ఉన్న 'బాహుబలి' అక్కడే చిత్రబృందంతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సెట్స్‌లోనే కేకు కోసి సందడి చేశారు.

ఇటలీలో ప్రభాస్​ పుట్టినరోజు వేడుక
ప్రభాస్

పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు డార్లింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల నుంచి సర్‌ప్రైజ్‌ చేస్తూ 'రాధేశ్యామ్‌' చిత్రబృందం తొలి‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. 'బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌' పేరుతో విడుదలైన ఈ పోస్టర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జంటగా పూజా హెగ్డే సందడి చేయనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.