నాలుగు చిత్రాల్లో జంటగా నటించి అలరించిన ప్రభాస్- అనుష్క ప్రేమలో పడ్డారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 'సాహో' చిత్ర ప్రచారంలో భాగంగా ఆంగ్ల మీడియా సమావేశంలో ప్రభాస్ పాల్గొన్నప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.
"మేమిద్దరం మంచి స్నేహితులం. మా మధ్య అంతకు మించి మరేం లేదు. మీరు అనుకుందే నిజమైతే.. నేను, అనుష్క జంటగా కనిపించి ఉండాలి కదా? రెండేళ్లలో నేను తనతో కలిసుండటం చూశారా? అనుష్క గురించి కరణ్ జోహర్ షోలో కూడా అడిగారు. అప్పుడు రానా, రాజమౌళి మా మధ్య ఏం లేదని సమాధానం చెప్పారు" అని ప్రభాస్ వివరించాడు.
ప్రభాస్, అనుష్క కలిసి 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి', 'బాహుబలి 2' చిత్రాల్లో నటించారు.
ఇవీ చూడండి.. ప్రఖ్యాత 'గ్రాండ్ రెక్స్' థియేటర్లో 'సాహో'