ETV Bharat / sitara

నెట్టింట పవర్​స్టార్ రచ్చ... ట్రెండింగ్​లో టీజర్​ - puneeth rajkumar as rugby player

నందమూరి నటసింహం బాలకృష్ణ టైటిల్‌తో పవర్ స్టార్ పునీత్ రాజ్​కుమార్ వెండితెరపై సందడి చేయనున్నాడు. ఈ సినిమా టీజర్​ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఇది ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్​గా మారింది.

నెట్టింట పవర్​స్టార్ రచ్చ... ట్రెండింగ్​లో టీజర్​
author img

By

Published : Oct 11, 2019, 4:19 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ టైటిల్‌తో పవర్ స్టార్ సినిమా రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్​ విడుదలై... నెట్టింట ట్రెండింగ్​లో నిలిచింది. అసలు విషయమేంటంటే ప్రముఖ కన్నడ హీరో పునీత్ రాజ్​కుమార్‌ను అభిమానులు ముద్దుగా 'పవర్ స్టార్' అని పిలుచుకుంటారు. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రానికి 'యువరత్న' అనే టైటిల్​ను పెట్టి టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ఒకప్పుడు నందమూరి బాలకృష్ణను అభిమానులు 'యువరత్న' అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పేరునే పవర్​స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తన సినిమాకు టైటిల్​గా పెట్టుకున్నాడు. గతంలో 'యువరత్న' టైటిల్‌తో తారకరత్న హీరోగా ఓ సినిమానూ వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నెట్టింట దూసుకెళ్తోంది...

తాజాగా విడుదలైన 'యువతర్న'లో రగ్బీ క్రీడాకారుడిగా సందడి చేయనున్నాడు పునీత్​. దీనికి సంతోష్​ ఆనంద్​రామ్​ దర్శకుడు. సాయేషా ఈ సినిమాతో కన్నడ తెరపై హీరోయిన్​గా అరంగేట్రం చేస్తోంది.

సీనియర్​ నటుడు బొమన్​ ఇరానీ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. హోమ్​బలే ఫిల్మ్స్​ బ్యానర్​పై తెరకెక్కుతోందీ సినిమా. గతంలో 'కేజీఎఫ్' చిత్రాన్ని ఇదే సంస్థ నిర్మించింది. తమన్​ బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ప్రస్తుతం పునీత్​ 'జేమ్స ఇన్​ హిజ్​ కిట్టీ' అనే మరో సినిమాలోనూ నటిస్తున్నాడు.

మంచి బంధాలున్నాయి...

రాజ్ కుమార్ కుటుంబంతో నందమూరి ఫ్యామిలీకి మంచి అనుబంధముంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలను కన్నడలో రాజ్ కుమార్ రీమేక్ చేసి మంచి విజయాలు అందుకున్నాడు. బాలకృష్ణ వందో సినిమా 'గౌతమి పుత్ర శాతకర్ణి'లో పునీత్​ తండ్రి శివరాజ్ కుమార్ ఒక పాటలో అతిథిగానూ కనిపించాడు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mamallapuram - 11 October 2019
1. Various of posters of Indian Prime Minister Narendra Modi and Chinese President Xi Jinping on walls
2. Gate leading to Shore Temple, one of the venues of Modi and Xi's meeting
3. Zoom into police directing vehicle
4. Modi and Xi's poster
5. Various of police walking and inspecting security arrangements
6. Various of police checking IDs
7. Traffic moving past standing police
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Mamallapuram - 10 October 2019
8. Various of Shore Temple seen through gates, people outside
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Mamallapuram - 11 October 2019
9. Various of beach
STORYLINE:
Preparations were under way in Mamallapuramon Friday ahead of Indian Prime Minster Narendra Modi and Chinese President Xi Jinping's meeting.
Saturday's talks come amidst rising tensions after China supported India's rival Pakistan over the dispute in Kashmir at the United Nations General Assembly.
The two leaders will be touring the temple town in southern India at the tip of the Bay of Bengal before sitting down for their first one-on-one meeting since April 2018 in Wuhan, China.
Regional development is one of the topics which will be discussed at Saturday's meeting, according to the Indian Foreign Ministry.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.