కరోనా లాక్డౌన్ సమయంలో బాధ్యత లేకుండా రహదారులపైకి వచ్చే వారంతా దేశానికి ద్రోహం చేస్తున్నట్లేనని ప్రముఖ రచయిత, కవి జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని పీడిస్తోన్న కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని కష్టాలు పడుతున్నా.. ఎంత నచ్చజెబుతున్నా విననివారు కరోనా కంటే ఘోరమైన మానసిక వ్యాధితో బాధపడుతుంటారని పేర్కొన్నారు.
కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తనవంతు బాధ్యతగా "ఇంట నుండి కరోనాను గెంటి వేయండంటూ" ప్రత్యేక గీతాన్ని ఆలపించారు జొన్నవిత్తుల. ఆద్యంతం సందేశాత్మకంగా ఉన్న ఆ పాటలో.. గడపదాటకుండా ఉండటమే ప్రజలకు శ్రీరామరక్ష అని చెబుతున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి.. ఫరాఖాన్ కుమార్తె మంచి మనసు.. రూ.70 వేల విరాళం