ETV Bharat / sitara

పవన్​కల్యాణ్​ అభిమానులకు గుడ్‌ న్యూస్‌! - అయ్యప్పనుమ్​ కోషియుమ్​లో పవన్ పాట

పవర్​స్టార్​​ అభిమానులకు శుభవార్త! 'అయ్యప్పనుమ్​ కోషియుమ్' రీమేక్​ కోసం పవన్​ మరోసారి గాయకుడి అవతారమెత్తనున్నారు. పవన్ ఇందులో​ ఓ పాట పాడనున్నారని సంగీత దర్శకుడు తమన్​ స్పష్టం చేశారు. ​

Pawan Kalyan to be sing a song in ayyappanum koshiyum remake
పవన్​కల్యాణ్​ అభిమానులకు గుడ్‌ న్యూస్‌!
author img

By

Published : Apr 4, 2021, 2:37 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మరోసారి తన అభిమానులను ఫిదా చేయనున్నారు. తన కొత్త చిత్రం కోసం ఆయన గాయకుడిగా అవతారమెత్తనున్నారు. పవన్​ కథానాయకుడిగా 'అయ్యప్పనుమ్ కోషియుమ్​' రీమేక్‌ తెరకెక్కుతోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం పవన్‌ కల్యాణ్‌ ఓ పాటపాడనున్నారని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ స్పష్టం చేశారు.

"పవన్‌ కల్యాణ్‌కు సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఆయన సినిమాలకు సంగీతం అందించాలని ఎప్పటి నుంచో నాకు ఓ కోరిక ఉంది. 'వకీల్‌సాబ్‌'తో నా కల నెరవేరింది. అలాగే 'అయ్యప్పనుమ్‌ కోషియం' రీమేక్‌కు కూడా సంగీతం అందిస్తున్నాను. అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ రీమేక్‌ కోసం పవన్‌ ఓ పాట పాడనున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వల్లే 'వకీల్‌సాబ్‌', 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్​' ప్రాజెక్ట్‌లలో నేను భాగమయ్యాను."

- ఎస్​ఎస్​ తమన్​, సంగీత దర్శకుడు

అయితే, పవన్‌ ఇప్పటికే ఎనిమిదిసార్లు తన పాటలతో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నారు. 'తమ్ముడు'లో 'ఎమ్‌ పిల్ల మాటాడవా', 'తాటిచెట్టు ఎక్కలేవు' పాటలతో మెప్పించిన పవన్‌ 'ఖుషి'లో ఓ జానపదగీతంతో అలరించారు. అనంతరం 'జానీ'లో 'నువ్వు సారా తాగుతా', 'రావోయి మా ఇంటికి', 'పంజా'లో 'పాపారాయుడు', 'అత్తారింటికి దారేది'లో 'కాటమరాయుడా', 'అజ్ఞాతవాసి'లో 'కొడకా కొటేశ్వరరావు' పాటలతో పవన్‌ ఫ్యాన్స్‌ని ఫుల్‌ ఖుషీ చేశారు.

ఇదీ చూడండి: 'బ్లాక్​ విడో' ట్రైలర్​.. 'రిపబ్లిక్​' టీజర్ అప్​డేట్​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.