ETV Bharat / sitara

'వకీల్ సాబ్'​ నుంచి పవన్ లాయర్ లుక్ లీక్ - పవన్ కల్యాణ్ వకీల్ సాబ్

పవన్ కల్యాణ్ హీరోగా 'వకీల్ సాబ్' అనే చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్​డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ చిత్రంలోని ఓ ఫొటో నెట్టింట లీకై వైరల్​గా మారింది.

Pawan Kalyan look leak from Vakeelsaab Movie
పవన్
author img

By

Published : Jun 29, 2020, 1:02 PM IST

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వకీల్‌సాబ్‌'. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌లకు సంబంధించి ఆంక్షలు సడలించడం వల్ల మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందుకు తగినట్లు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. పవన్‌ ఇందులో లాయర్‌గా కనిపించనున్నాడు. ఆయన కోర్టులో నల్లకోటు ధరించి వాదనలు వినిపిస్తున్న సన్నివేశానికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో నటి అంజలి కూడా ఉండటం విశేషం. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌, పవన్‌ లుక్‌ మినహా మిగిలిన పాత్రలను పరిచయం చేయలేదు. తాజాగా ఫొటో లీక్‌తో ఇందులో అంజలి నటిస్తున్నారని అర్థమవుతోంది.

Pawan Kalyan look leak from Vakeelsaab Movie
'వకీల్ సాబ్'​ నుంచి పవన్ లాయర్ లుక్ లీక్

మరి లాయర్‌గా పవన్‌ తన వాగ్ధాటితో వెండితెరపై ఎలా మెప్పిస్తారో చూడాలి. రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయన చాలా రోజుల విరామం తర్వాత నటిస్తున్న చిత్రం కావడం వల్ల దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్నట్లు 'వకీల్‌సాబ్' టైటిల్‌లో కనిపించే పవన్‌ ఐకాన్‌ కూడా మొదటిసారి లీకైన ఫొటో ఆధారంగా తీర్చిదిద్దినదే కావడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.