ETV Bharat / sitara

'వకీల్​సాబ్' విడుదల.. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి - పవన్ కల్యాణ్ వకీల్​సాబ్

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్​సాబ్' ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ కావడం వల్ల ఫ్యాన్స్​ ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. అర్ధరాత్రి నుంచి థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది.

Vakeelsaab t
వకీల్​సాబ్
author img

By

Published : Apr 9, 2021, 9:59 AM IST

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్​సాబ్' చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తికాగా హిట్​ టాక్​తో దూసుకెళ్తోందీ మూవీ. మూడేళ్ల తర్వాత పవన్ సినిమా చేయడం వల్ల అభిమనులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. పవన్​పై ఉన్న అభిమానాన్ని చాటుతూ అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పవన్‌ అభిమానులు భారీగా సంబరాలు జరుపుకొంటున్నారు. పవన్‌ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు కాల్చి.. డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అలాగే సినిమా సూపర్‌గా ఉందని, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదిరిపోయిందని నెటిజన్లు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్ ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్‌ నాయుడు ఇంటి ఎదుట పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. 'వకీల్‌ సాబ్‌' సినిమాకోసం అభిమానులు బెనిఫిట్‌ షో టికెట్లు కొన్నారు. కానీ, థియేటర్‌లో బెనిఫిట్‌ షో వేయకపోవడం వల్ల ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపు చేశారు.

హిందీ 'పింక్'​కు రీమేక్​గా తెరకెక్కింది 'వకీల్​సాబ్'. వేణు శ్రీరామ్ దర్శకుడు. శ్రుతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్యా నాగళ్ల, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.