బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా సినిమాల్లో కాస్త జోరు పెంచింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన 'జబరియా జోడీ' విడుదలకు సిద్ధమవుతుండగా... తర్వాతి చిత్రానికి పచ్చ జెండా ఊపేసింది. త్వరలో అమెరికా దర్శకుడు టేట్ టేలర్ దర్శకత్వంలో వచ్చిన ఇంగ్లీష్ మూవీ 'ద గర్ల్ ఆన్ ద ట్రెయిన్' హిందీ రీమేక్‌లో నటించనుంది. ఇది బ్రిటీష్ రచయిత పౌలా హాకిన్స్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది. త్వరలో ఈ సినిమా టైటిల్ సహా ఇతర విశేషాలను వెల్లడించనుంది చిత్రబృందం.

ఈ హాలీవుడ్ రీమేక్ చిత్రం కోసం కేశాలంకరణ చేయించుకుంటోన్న ఫొటోలను ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో పంచుకొంది పరిణీతి.
" నా జుత్తు రంగు మార్చుకుంటున్నాను. 'గర్ల్ ఆన్ ద ట్రెయిన్' కోసం తయారయ్యే సమయం వచ్చింది " అని కొత్త లుక్‌లో చిత్రాలను షేర్ చేసిందీ కేసరి నాయిక.
హాలీవుడ్ తెరపై తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి ఎమిలీ బ్లంట్ పాత్రలో పరిణీతి నటించనుంది. 2020లో ఈ సినిమా విడుదల కానుంది.

'జబరియా జోడీ'లో సిద్ధార్థ్ మల్హోత్రాతో జతకట్టింది పరిణీతి. ఈ సినిమా ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్, బుజ్: ద ప్రైడ్ ఆఫ్ ఇండియా, సందీప్ ఔర్ పింకి ఫరార్ వంటి చిత్రాలు చేతిలో ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">