అన్‌లాక్ 5.0 ప్రక్రియలో భాగంగా గతనెలలో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. కానీ ప్రజలు మాత్రం వెళ్లాలా? వద్దా? అనే ఆలోచనతో ఇంకా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ సర్వేలో జరపగా, కేవలం ఏడు శాతం మంది మాత్రమే హాల్‌కు వెళ్లి సినిమా చూడాలనే ఆసక్తి చూపారు!
ఏడు నెలల తర్వాత తెరుచుకున్నా సరే..
కరోనా ప్రభావంతో మార్చి మూడో వారంలో దేశవ్యాప్తంగా థియేటర్లను మూసేశారు. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 15 నుంచి తెరుచుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో పలు రాష్ట్రాలో నిబంధనలు పాటిస్తూనే వాటిని తెరిచారు. జనాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నారు.

ఏడు శాతం మందే
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిపిన సర్వేలో భాగంగా 'రానున్న రెండు నెలలో థియేటర్లకు వెళ్తారా?' అని 8274 మంది నుంచి అభిప్రాయాల్ని సేకరించారు.

ఏదైనా కొత్త సినిమా విడుదలైతే వెళ్తామని 4 శాతం మంది చెప్పగా, కొత్త పాతతో సంబంధం లేకుండా థియేటర్‌కు వెళ్తామని 3 శాతం మంది అన్నారు. 74 శాతం వెళ్లమని, 2 శాతం ఆలోచిస్తామని, 17 శాతం మంది మాత్రం థియేటర్లో సినిమా చూడాలనుకోవట్లేదని వెల్లడించారు.
ప్రేక్షకుల ఆరోగ్యమే మా ధ్యేయం
ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం సీటు సీటుకు మధ్య దూరం, షో టైమింగ్స్‌లో మార్పు, థర్మల్ స్క్రీనింగ్, భౌతిక దూరం పాటిస్తున్నట్లు పలు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. ప్రేక్షకుల ఆరోగ్యమే తమ ధ్యేయమని అంటున్నాయి.

దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బంగాల్, మధ్య ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో థియేటర్లు తెరుచుకోగా.. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, చత్తీస్ఘడ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇంకా వాటిని ఓపెన్ చేయలేదు.
ఇవీ చదవండి: