ETV Bharat / sitara

ఇదొక మరపురాని అనుభవం: రకుల్ - ఇదొక మరపురాని అనుభవం: రకుల్

దక్షిణాదితో పాటు బాలీవుడ్​లో నటిస్తూ బిజీగా ఉంది నటి రకుల్​ప్రీత్ సింగ్. ప్రస్తుతం 'సర్ధార్ కా గ్రాండ్​సన్' చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర అనుభవాలను పంచుకుంది రకుల్.

Rakulpreet
రకుల్
author img

By

Published : Apr 23, 2021, 6:46 PM IST

తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ నటిస్తోన్న అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆ మధ్య హీరో నితిన్‌తో కలిసి 'చెక్‌' చిత్రంలో మానసగా నటించి మెప్పించింది. ప్రస్తుతం రకుల్‌ బాలీవుడ్‌లో 'సర్ధార్‌ కా గ్రాండ్‌సన్‌' చిత్రంలో నటిస్తోంది. కాశ్వీ నాయర్ దర్శకత్వంలో రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో అర్జున్‌ కపూర్‌, జాన్‌ అబ్రహాం, అదితిరావు హైదరీలు నటిస్తున్నారు. చిత్రంలో రకుల్‌ 'రాధ' అనే సున్నితమైన అమ్మాయి పాత్రలో కనిపించనుంది.

తాజాగా ఈ సినిమా గురించి రకుల్ స్పందిస్తూ.. "వ్యక్తిగతంగా నాకు డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. లారీని నడపటం శిక్షకులు చెప్పినంత ఈజీ కాదు. నేను ఊహించిన దానికంటే కొంచెం సరదాగానే అనిపించింది. కానీ, నేను నడపడం చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నా జీవితంలో గుర్తుంచుకోదగిన అనుభవం" అని తెలిపింది.

ఈ సినిమా మే 18న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. రకుల్ ప్రస్తుతం హిందీలో 'అటాక్‌', 'మేడే', 'థ్యాంక్‌ గాడ్‌'లాంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో ఆమె క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి నటించింది. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.