బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తుపై ఇంకా ఎలాంటి తుది అభిప్రాయానికి రాలేదని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు అధికారి తెలిపారు. ప్రస్తుతం వృత్తిపరమైన దర్యాప్తు కొనసాగుతోందని చెప్పిన ఆయన.. విచారణలో ఏ కోణాన్ని విస్మరించలేదని వివరణ ఇచ్చారు.
సీబీఐ దర్యాప్తు నెమ్మదిగా సాగుతూ, పక్కదారి పడుతుందని సుశాంత్ తరఫు న్యాయవాది వికాస్, గతవారం ఆరోపించిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది సీబీఐ. జూన్ 14న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని సుశాంత్ చనిపోయారు. అనంతరం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కొద్ది రోజులుగా డ్రగ్స్‌కు సంబంధించిన అంశం చర్చనీయాంశమైంది. దీంతో సుశాంత్ కేసును పక్కన పెట్టి.. మాదక ద్రవ్యాలపై దృష్టి సారిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి 'చిన్నారి పెళ్లికూతురు' దర్శకుడు.. కూరగాయలు అమ్ముతూ