ETV Bharat / sitara

జాన్వీ కపూర్ డ్రెస్​లో నిహారిక.. ఫొటోలు వైరల్ - నిహారిక-చైతన్య రిసెప్షన్

మెగా డాటర్ నిహారిక-చైతన్యల వివాహం ఉదయ్​పూర్​లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆత్మీయులందరి కోసం తాజాగా కొణిదెల-జొన్నలగడ్డ కుటుంబాలు రిసెప్షన్​ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన ఈ వేడుకలో నిహారిక బ్రైడల్ లెహంగాని ధరించి మెరిసిపోయారు.

Niharika In Manish Malhotra Dress
జాన్వీ కపూర్ డ్రెస్​లో నిహారిక.. ఫొటోలు వైరల్
author img

By

Published : Dec 12, 2020, 11:04 AM IST

మెగా డాటర్ నిహారిక-చైతన్యల వివాహం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లో వేడుకగా జరిగింది. ఆత్మీయులందరి కోసం తాజాగా కొణిదెల-జొన్నలగడ్డ కుటుంబాలు రిసెప్షన్‌ను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ వివాహ విందుకు చిరంజీవి కుటుంబంతోపాటు బంధువులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Niharika In Manish Malhotra Dress
నిహారిక-చైతన్య

కాగా, రిసెప్షన్‌లో నిహారిక.. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్ర రూపొందించిన బ్రైడల్‌ లెహంగాని ధరించి మెరిసిపోయారు. లైట్‌ గ్రీన్‌, గోల్డ్‌ కలర్‌లో ఉన్న ఈ లెహంగాలో నిహారిక చాలా అందంగా కనిపించారు. అయితే, మనీశ్‌ మల్హోత్ర బ్రైడల్‌ కలెక్షన్‌ ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల రూపొందించిన ఓ ప్రకటనలో జాన్వీ కపూర్‌ ఈ లెహంగానే ధరించి రాకుమార్తెలా ముస్తాబయ్యారు. అప్పట్లో జాన్వీ ఫొటోలు కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

Niharika In Manish Malhotra Dress
నిహారిక-చైతన్య

తాజాగా రిసెప్షన్‌ కోసం నిహారిక అదే తరహా లెహంగాలో కనిపించడం వల్ల పలువురు నెటిజన్లు.. "వావ్‌.. మనీశ్‌ దుస్తుల్లో అప్పుడు జాన్వి.. ఇప్పుడు నిహారిక ఎంతో అందంగా ఉన్నారు.", "కొత్త పెళ్లికూతురు మరెంతో అందంగా ఉన్నారు" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Niharika In Manish Malhotra Dress
జాన్వీ కపూర్

ఇవీ చూడండి.. నిహారిక వెడ్డింగ్​: మెగా ఫ్యామిలీ సందడే సందడి

నా మదిలో వీణగానం.. మీకూ వినిపిస్తోందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.