ETV Bharat / sitara

ఆ పాత్రల్లో నటించడమే నాకిష్టం: నిధి అగర్వాల్ - pawan latest news

గ్లామర్, మోడ్రన్​ పాత్రలే కాకుండా డిఫరెంట్​గా ఉండే రోల్స్​లో కనిపించడం తనకు ఇష్టమని హీరోయిన్ నిధి అగర్వాల్(nidhi agarwal movie list) చెబుతోంది. 'హరిహర వీరమల్లు' సినిమాలో తనకు అవకాశం దక్కడం ఆనందంగా ఉందని తెలిపింది.

nidhi agarwal
నిధి అగర్వాల్
author img

By

Published : Oct 21, 2021, 6:36 AM IST

Updated : Oct 21, 2021, 7:21 AM IST

'మోడ్రన్‌ గర్ల్‌.. గ్లామర్‌ హీరోయిన్‌'.. అన్న మాటలు వినీ వినీ అలిసిపోయానని అంటోంది నటి నిధి అగర్వాల్‌(nidhi agarwal upcomin movies). తెరపై గ్లామర్‌ డాల్‌గా కనిపించడం కన్నా.. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించడమే తనకిష్టమని చెబుతోంది. ప్రస్తుతం ఈ అందాల నిధి.. పవన్‌ కల్యాణ్‌కు(pawan kalyan new movie) జోడీగా 'హరి హర వీరమల్లు'లో(harihara veeramallu release date) నటిస్తుంది. క్రిష్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రమిది. ఈ చిత్ర విశేషాలను నిధి అగర్వాల్‌(nidhi agarwal twitter) ఇటీవల చెప్పింది.

nidhi agarwal
నిధి అగర్వాల్

"వీరమల్లు..'లో నేను పంచమి అనే యువరాణిగా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే ఎంతో వైవిధ్యభరితమైన పాత్ర ఇది. శారీరకంగా నాకెంతో సవాల్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం చాలా ఆభరణాలు ధరించాను. ఒంటిపై ధరించిన కాస్ట్యూమ్స్‌ చాలా బరువైనవి. ప్రతిదీ చేతితో కుట్టినదే. అందుకే వీటిని క్యారీ చేస్తూ.. షూట్‌లో పాల్గొనడం ఎంతో కష్టంగా అనిపించేది. ఓ షాట్‌ అయిపోతే జాగ్రత్తగా ఓ దగ్గర కూర్చోవడమే తప్ప.. విశ్రాంతి తీసుకోవడానికి వీలుండేది కాదు. అయితే ఈ కష్టమంతా నాకెంతో విలువైనదిగా అనిపించేది. నటిగా ఇంత అద్భుతమైన చిత్రంలో భాగమైనందుకుఆనందంగా ఉంది" అని నిధి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో 'హీరో' అనే మరో సినిమాలోనూ నటిస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 21, 2021, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.