ETV Bharat / sitara

'నాట్యం'కు అరుదైన గౌరవం.. చిత్రబృందం ఫుల్ హ్యాపీ - మూవీ న్యూస్

కూచిపూడి నృత్య నేపథ్య కథతో తీసిన 'నాట్యం' సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు నుంచి ఈ ఏడాదికిగానూ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రదర్శనకు ఎంపికైన ఏకైక చిత్రంగా నిలిచింది.

natyam movie
నాట్యం మూవీ
author img

By

Published : Nov 6, 2021, 4:38 PM IST

భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ నిర్మించిన 'నాట్యం' చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు జరుగనున్న 52వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రంగా నిలిచింది. కేంద్ర ప్రసార సమాచార మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో హర్షం వ్యక్తం చేసిన చిత్ర బృందం.. జ్యూరీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

natyam movie
నాట్యం మూవీ

నూతన దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'నాట్యం' ఎంతో మంది సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలందుకొని బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్​లో 'నాట్యం' ప్రదర్శనకు ఎంపిక కావడం పట్ల చిత్ర దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కూడా 'నాట్యం' బృందాన్ని ప్రశంసించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.