ETV Bharat / sitara

Mohanbabu Issue in HRC: మోహన్​బాబుపై హెచ్​ఆర్​సీలో ఫిర్యాదు.. ఎందుకంటే? - మోహన్​బాబుపై హెచ్​ఆర్సీలో ఫిర్యాదు

సినీనటుడు మంచు విష్ణు కార్యాలయంలో జరిగిన హెయిర్​ డ్రెస్సర్​ వివాదం మరింత ముదురుతోంది. నాయి బ్రాహ్మణులను కించపరిచేలా హీరో మోహన్​బాబు మాట్లాడారంటూ ఆ సంఘం నాయకులు మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. హైదరాబాద్​లోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశారు.

నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు
నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు
author img

By

Published : Mar 4, 2022, 3:58 PM IST

Mohanbabu Issue in HRC: సినీ నటుడు మంచు మోహన్ బాబుపై నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేశారు. నాయి బ్రాహ్మణ కులాన్ని కించపరుస్తూ మోహన్ బాబు వ్యాఖ్యలు చేశారని కమిషన్​ దృష్టికి తీసుకెళ్లారు. క్షమాపణ చెప్పేందుకు రెండు రోజులు గడువువిచ్చినా ఆయన స్పందించలేదని నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా కూడా కులాలపై దాడి ఏంటని ఆయన ప్రశ్నించారు.

మోహన్ బాబు ఇంటిలో నాగ శ్రీను అనే వ్యక్తి 11 ఏళ్లుగా హెయిర్ డ్రెస్సర్​గా నమ్మకంగా పని చేస్తున్నాడని శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు తప్పుడు కేసులు బనాయించి కులం పేరుతో దూషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి కులం పేరుతో నానా దుర్భాషలాడుతూ వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేయకుండా సమగ్ర విచారణ చేసి బాధితుడికి న్యాయం చేయాలని హెచ్​ఆర్​సీని ఆశ్రయించినట్లు శ్రీనివాస్ తెలిపారు.

హెయిర్​ డ్రెస్సర్​పై ఫిర్యాదు

మంచు విష్ణు కార్యాలయంలో పనిచేసే హెయిర్​ డ్రెస్సర్​ నాగ శ్రీను రూ.5 లక్షల విలువైన వస్తువులు నాగశ్రీను ఎత్తుకెళ్లాడంటూ జూబ్లీహిల్స్‌ ఠాణాలో ఆయన లీగల్‌ మేనేజర్‌ ఫిర్యాదు చేశారు. అయితే మంచు కుటుంబం తనపై అక్రమ కేసు పెట్టిందని హెయిర్​ డ్రెస్సర్ ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.