ETV Bharat / sitara

'సూపర్​' కాంబోతో హ్యాట్రిక్​ కొడతారా? - నాగార్జున, పూరి జగన్నాథ్​ కొత్త సినిమా అప్​డేట్​

అక్కినేని నాగార్జున హీరోగా పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో మరో క్రేజీ చిత్రం రాబోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్​ జరుగుతుందని సమాచారం. పూరి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'ఫైటర్​' చిత్రీకరణ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది.

Nagarjuna Akkineni to play the lead in an upcoming film by director Puri Jagannadh?
'సూపర్​' కాంబోలో హ్యాట్రిక్​ కొడతారా?
author img

By

Published : Aug 21, 2020, 8:04 AM IST

కింగ్​ నాగార్జున - పూరీ జగన్నాథ్​ కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు చెప్పిన స్టోరీ నాగార్జునకు నచ్చడం వల్ల ఆయన గ్రీన్​సిగ్నల్​ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పూరి రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్​ వర్క్​ జరుగుతుందని తెలుస్తోంది. ఈ వార్త అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది.

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'బిగ్​బాస్​ 4' రియాల్టీ షో చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రొమో ఇటీవలే విడుదలై.. ప్రేక్షకుల నుంచి విశేషాదరణను దక్కించుకుంది. ఈ నెలాఖరు నుంచి ఈ రియాల్టీ షో ప్రసారం కానుంది. ప్రస్తుతం పూరి​ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా ఓ పాన్​ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అనన్యా పాండే హీరోయిన్​గా నటిస్తుండగా.. పూరీ జగన్నాథ్​, ఛార్మి, కరణ్​ జోహర్​ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.