ETV Bharat / sitara

నిర్మాణ రంగంలోకి అక్కినేని హిట్ జోడీ - Naga Chaitanya & Samantha Akkineni are all set to launch their own production house?

అక్కినేని హిట్​ జోడీ నాగచైతన్య-సమంత కలిసి, సొంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించనున్నారని టాక్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయని సమాచారం.

production_
అక్కినేని కుటంబం నుంచి మరో ప్రొడక్షన్ హౌస్​
author img

By

Published : Mar 1, 2020, 5:16 AM IST

Updated : Mar 3, 2020, 12:46 AM IST

అన్నపూర్ణ స్టూడియోస్​ అంటే టక్కున గుర్తొచ్చేది అక్కినేని కుటుంబం. ఈ బ్యానర్​పై అనేక మంది నూతన నటీనటులు, దర్శకులు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. కొన్నేళ్ల క్రితం మనం ప్రొడక్షన్స్​ అనే మరో నిర్మాణ సంస్థను వీరు నెలకొల్పారు. ఇప్పుడు మరో నిర్మాణ సంస్థను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని టాక్. నాగచైతన్య-సమంత కలిసి దీనిని స్థాపించనున్నారని సమాచారం. ఇందులో కొత్త టాలెంట్​ను ప్రోత్సహించాలని భావిస్తున్నారట.

ఇప్పటికే ఓ కొత్త దర్శకుడితో సంప్రదింపులు జరిపారని, రాజ్​తరుణ్​ హీరోగా సినిమా తీయాలని అనుకుంటున్నారని టాక్​. వీటిపై ఓ స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

నాగచైతన్య.. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో 'లవ్​స్టోరీ' సినిమాలో నటిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇదీ చూడండి : రామ్​చరణ్​కు ఆ 'డ్రైవింగ్‌ లైసెన్స్‌'తో సంబంధం లేదట!

Last Updated : Mar 3, 2020, 12:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.