ETV Bharat / sitara

NBK 107: బాలకృష్ణ సినిమా టైటిల్​.. నిర్మాణ సంస్థ క్లారిటీ - balakrishna new movie

బాలయ్య-డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్​లో రాబోయే సినిమా టైటిల్​ ఇదేనంటూ గతకొన్నిరోజులుగా రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీటికి చెక్ పెట్టింది నిర్మాణ సంస్థ. త్వరలో తామే ప్రకటిస్తామని తెలిపింది.

NBK 107 TITLE
బాలకృష్ణ
author img

By

Published : Sep 15, 2021, 9:53 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఓ చిత్రం ప్రకటించారు. 'NBK 107' వర్కింగ్‌ టైటిల్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాకు 'ఆ టైటిల్‌ ఖరారు చేశారు', 'ఈ పేరు పెట్టారంటూ' గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. దీనిపై చిత్రబృందం బుధవారం స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని, అలాంటి రూమర్లు నమ్మొద్దని ఓ ప్రకటన విడుదల చేసింది.

NBK 107 TITLE
బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్

"NBK 107' సినిమా పేరు గురించి వస్తున్న వార్తలు అవాస్తవమైనవి. సరైన సమయంలో మేమే టైటిల్‌ అధికారికంగా ప్రకటిస్తాం. మరిన్ని అప్‌డేట్లు అందిస్తాం' అని మైత్రీమూవీ మేకర్స్ పేర్కొంది.

వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. బాలకృష్ణ పవర్‌ఫుల్‌ లుక్‌లో దర్శనమివ్వనున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సూపర్‌ హిట్‌ చిత్రం 'క్రాక్‌' తర్వాత గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వస్తుండటం వల్ల 'NBK 107'పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. బాలకృష్ణ ప్రస్తుతం 'అఖండ' చిత్రంతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.