ETV Bharat / sitara

'సంగీత ప్రపంచంలో ఘంటసాల సూర్యుడైతే.. బాలు చంద్రుడు' - ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్​. బాలుకు అత్యంత సన్నిహితుడైన సురేశ్​ ఆయన ఆర్కెస్ట్రాలో సభ్యుడిగా, సంగీత దర్శకుడిగా పనిచేశారు. ఎస్పీబీతో తన సంగీత ప్రయాణాన్ని గురించి ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Music director Madhavapeddi Suresh recalls his association with SP Balasubramanian
సంగీత ప్రపంచంలో ఘంటసాల సూర్యుడు.. బాలు చంద్రుడు
author img

By

Published : Sep 30, 2020, 7:10 AM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం... ఓ సంగీత సంద్రం. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన స్వర ప్రయాణంలో మూడు తరాలతో కలిసి పనిచేశారు. పాటే ప్రపంచంగా బతికిన ఆయనతో 54 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగించారు ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్​. బాలు ఆర్కెస్ట్రాలో సభ్యుడిగా, సంగీత దర్శకుడిగా, కుటుంబ సన్నిహితుడిగా చాలా దగ్గర్నుంచి చూశారు మాధవపెద్ది సురేశ్​. ఈ సందర్భంగా బాలుతో ఆయనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

"సంగీతం పరంగా చెప్పాలంటే మాధవపెద్దిలో మధ్యమం ఉంది. పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంలో పంచమం ఉంటుంది. సరిగమపదనిలో మధ్యమం దగ్గరే పంచమం ఉంటుంది. మా ఇద్దరి అనుబంధం అలాంటిదే. నన్ను 1974లో చలపతిరావు 'పరివర్తన' సినిమాతో వాద్య కళాకారుడిగా పరిచయం చేశారు. ఆ రికార్డింగ్‌ పాడింది బాలుగారే. 1989లో నేను సంగీత దర్శకుడినయ్యాక నేను స్వరపరిచిన 'ఇది సరిగమలెరుగని రాగము...' (హై హై నాయకా) పాట పాడిందీ ఆయనే. వాద్య కళాకారుడిగా నేనెక్కడికి వెళ్లి ఏ పాటలు వాయించినా 98 శాతం బాలు పాడేవే. 'శంకరాభరణం' మొదలుకొని ఎన్నో సినిమాలకు కీ బోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేశా. 1975 నుంచి బాలు ఆర్కెస్ట్రా బృందంలో కీ బోర్డ్‌ ప్లేయర్‌గా 12 ఏళ్లు పనిచేశా. మొదటిసారి 1979లో అమెరికా వెళ్లాం. అక్కడ్నుంచి ఎన్నో దేశాలు తీసుకెళ్లారు. సంగీత కచేరీల కోసం వేరే దేశాలకు వెళ్లినప్పుడు అక్కడున్న వింతలు, విశేషాల్ని మాకు చూపించకుండా తీసుకొచ్చేవారు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న స్నేహితులంతా నా స్నేహితులే. మా అన్నయ్య మాధవపెద్ది రమేశ్​ నా జీవితంలో ఎంత ముఖ్యమో. బాలు గారు అంత ముఖ్యం. బాలు తల్లిదండ్రులూ నన్ను వాళ్ల అబ్బాయిగానే చూసుకున్నారు" అని తెలిపారు మాధవపెద్ది సురేశ్.

  • "బాలు సంగీత దర్శకుడయ్యాక ఆయన చేసిన 95 శాతం సినిమాలకు నేనే కీ బోర్డ్‌ ప్లేయర్‌ని. నేను సంగీత దర్శకుడినయ్యా. నేను స్వరపరిచిన తొలి పాట మొదలుకొని తొంభై శాతం పాటలు ఆయనే పాడారు. ఆకాశవాణిలో అన్నమాచార్య కీర్తనలు చేశా. వాటితోపాటు, నేను చేసిన ప్రైవేట్‌ ఆల్బమ్‌లూ ఆయనే పాడేవారు. 'మేడమ్‌', 'భైరవద్వీపం', 'బృందావనం'.. ఇలా గొప్ప చిత్రాల్లో నాకు పాడారు. 'పాడుతా తీయగా' మొదటి ఆరు సిరీస్‌లకు నేనే ప్రతి ఊరుకెళ్లి పిల్లల్ని ఎంపిక చేసేవాణ్ని. వృత్తి పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ ఆయన నాకు చాలా సన్నిహితులు. మద్రాస్‌లో మా అమ్మాయి వాళ్ల ఇంటికి దగ్గర్లోనే బాలుగారి ఇల్లు. కోడంబాక్కంలో ఆ ఇల్లు కట్టినప్పట్నుంచి మాకు తెలుసు. అక్కడ ఎన్నో శుభకార్యాలకు హాజరయ్యాం. ఈ ఏడాది ఫిబ్రవరి 12న నేను, నా భార్య, మా అమ్మాయి కుటుంబం, మా అబ్బాయి కలిసి వెళితే మూడు గంటలపాటు కూర్చోబెట్టి సరదాగా మాట్లాడారు బాలు. అదే ఆఖరిసారి ఆయన్ని చూడటం. ఆస్పత్రికి వెళ్లడానికి మూడు రోజుల ముందు ఫోన్‌ చేసి మాట్లాడారు" అని సురేశ్​ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
  • "విసుగు, విరామం అనేది బాలులో ఎప్పుడూ చూడలేదు. అందరితో సులభంగా కలిసిపోయేవారు. ముందు తరం వాళ్లతో కానీ, ఆయన సమకాలీలకులతో కానీ, తర్వాత తరం వాళ్లు కానీ...అందరితోనూ సొంత కుటుంబ సభ్యుడిలా కలిసిపోయేవారు. ఎంత కష్టమైన పాటైనా అవలీలగా పాడేవారు. 'మేడమ్‌' సినిమా కోసం ఆడగొంతుతో పాడించా. అవలీలగా పాడారు. నృసింహస్వామి మీద శతకం పాడిస్తే, దాన్ని వంద రాగాల్లో అద్భుతంగా పాడారు. నవరసాలకు న్యాయం చేయగల గొప్ప గాయకుడు ఎస్పీబీ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఏ భాషలోనైనా అక్షర దోషం లేకుండా పాడేవారు. అందుకే ఎక్కడికెళ్లినా బాలు మనోడే అనేవారు" అని అన్నారు.
  • "ఎంతోమంది గాయకులు ఉన్నారు. చాలా అద్భుతంగా పాడుతున్నారు. కానీ ఎస్పీ బాలు లోటును తీర్చడం ఎవరివల్లా కాదు. సంగీత ప్రపంచంలో ఘంటసాల సూర్యుడైతే, బాలు చంద్రుడు. సూర్యచంద్రుల తర్వాత ఇంకెవరిని చూపిస్తాం? పాటలు పాడటం మాత్రమే కాదు, భాష విషయంలోనూ ఆయనకున్న సాధికారత మరెవ్వరిలోనూ చూడలేదు. భాష అంటే చాలా ఇష్టం ఆయనకు. తెలుగే కాదు, ఏ భాషలో అయినా న్యాయం చేకూర్చేవారు. కేవలం గాయకుడిగానే కాకుండా, ప్రతి కుటుంబంలో వాళ్ల కుటుంబ సభ్యుడిలా మారిపోయారు. సంగీత ప్రపంచంలో అది ఆయనకు ఒక్కడికే చెల్లింది. ఆయన కచేరీల్లో దాదాపు అందరూ పనిచేసినవాళ్లమే. ఆయనతో చేసిన సుదీర్ఘమైన ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చింది. నాకోసం అద్భుతమైన పాటలు, అన్ని రకాల పాటలు పాడారు. ఈ జన్మకు ఇంతకంటే ఏం కావాలి? నేను ఏ సంగీతం చేసినా నాకు గుర్తుకొచ్చేది అప్పటికీ ఇప్పటికీ బాలుగారే" అని ఎస్పీబీ గురించి మాధవపెద్ది సురేశ్​ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.