ETV Bharat / sitara

బయోపిక్​ కోసం ధోనీకి రూ.45 కోట్లు.. మరి మిగతా స్టార్లకు?

బయోపిక్​లు తీయాలంటే చాలా విషయాలు సేకరించాలి. సరిపోయే నటుల్ని ఎంపిక చేయాలి. ఇతరత్రా అంశాలు ఇందులో ఉంటాయి. అయితే బయోపిక్​ తీయాలనే ప్రముఖులకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందనే విషయం మీకు తెలుసా? ఒకవేళ దాని గురించి తెలియకపోతే ఈ స్టోరీ చదివేయండి.

MS Dhoni charged Rs 45 crore for his biopic
ధోనీ సుశాంత్ సింగ్
author img

By

Published : May 21, 2021, 5:30 PM IST

బాలీవుడ్​లో బయోపిక్​ అంటే మనకు 'ధోని' సినిమా టక్కున గుర్తొస్తుంది. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా దీనిని తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణతో పాటు కలెక్షన్లూ సాధించిన ఈ చిత్రం తీసేందుకు ధోనీ.. రూ.45 కోట్లు తీసుకున్నారట. అవును మీరు విన్నది నిజమే. తన జీవితానికి సంబంధించిన రహస్య, కీలక సమాచారాన్ని ఇవ్వాలంటే ఆ మాత్రం ఇవ్వాలని మహీ భావించినట్లు ఉన్నాడు! ఇదే కాకుండా హిందీలోని పలు బయోపిక్​ల కోసం పలువురు ప్రముఖులు ఎంతెంత మొత్తం తీసుకున్నారు అనే విషయాలు సమాహారమే ఈ ప్రత్యేక కథనం.

1. ధోనీ (ఎంఎస్​ ధోని: ది అన్​టోల్డ్​ స్టోరీ)

బాలీవుడ్​లో తెరకెక్కిన 'ఎంఎస్​ ధోని: ది అన్​టోల్డ్​ స్టోరీ' బయోపిక్​ అందరి ప్రశంసలు అందుకుంది. ధోనీ పాత్రలో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్​ అద్భుతంగా నటించారు. నటిస్తుంది సుశాంత్ లేదా ధోనీనా అనేంతలా జీవించాడు.

sushant singh dhoni movie
ధోనీ బయోపిక్​లో సుశాంత్ సింగ్

ఈ బయోపిక్​లో చిన్ననాటి నుంచి ధోని.. క్రికెట్​పై చూపించే ఆసక్తి, ఆ తర్వాత భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తూ టీమ్​ఇండియాలో ఏ విధంగా చోటు సంపాదించుకున్నాడనేది చూపించారు. ధోనీ వ్యక్తిగత జీవితంతో పాటు క్రికెట్​ కెరీర్​ గురించి స్పష్టంగా చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. తన బయోపిక్​ను నిర్మించడానికి చిత్రబృందం నుంచి ధోని రూ.45 కోట్లను తీసుకున్నాడని ఓ సర్వే తెలిపింది. కానీ ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు!

2. సంజయ్​ దత్​ (సంజు)

బాలీవుడ్ స్టార్ సంజయ్​ దత్​ జీవితాధారంగా రూపొందిన చిత్రం 'సంజు'. సంజయ్​ దత్​ పాత్ర పోషించిన రణ్​బీర్​ కపూర్​కు విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. సంజయ్​ దత్​ వ్యక్తిగత జీవితంతో పాటు ఆయన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవరోధాలను కళ్లకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడు రాజ్​కుమార్​ హిరాణీ విజయం సాధించారు. అయితే ఈ బయోపిక్​ కోసం తన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నందుకుగానూ సంజయ్​ దత్​ రూ.9 నుంచి 10 కోట్లను తీసుకున్నాడని టైమ్స్​ ఆఫ్​ ఇండియా తెలిపింది. దీనితో పాటు బాక్సాఫీస్ వద్ద వచ్చిన లాభంలో భాగం కూడా తీసుకున్నాడని స్పష్టం చేసింది.

ranbir kapoor in sanju biopic
సంజు బయోపిక్​లో రణ్​బీర్ కపూర్

3. మేరీ కోమ్​ (మేరీకోమ్​)

భారత బాక్సింగ్​ క్రీడాకారిణి మేరీ కోమ్​ జీవితాధారంగా రూపొందిన చిత్రం 'మేరీకోమ్​'. 2008లో ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​గా నిలిచేంత వరకు ఆమె ఏ విధంగా కష్టపడిందనే విషయాన్ని వెండితెరపై దర్శకుడు ఓమంగ్​ కుమార్​ చక్కగా చూపించారు. ఇందులో ప్రియాంక చోప్రా టైటిల్​ రోల్​ చేసింది. తన బయోపిక్​ అనుమతి కోసం మేరీకోమ్ రూ.25 లక్షలు తీసుకున్నట్లు ఓ సర్వే తెలిపింది. ఈ సినిమాకు ఉత్తమ ఆదరణ పొందిన సినిమా విభాగంలో జాతీయ అవార్డు దక్కింది.

priyanka chopra mary kom biopic
మేరీకోమ్​ సినిమాలో ప్రియాంక

4. పాన్​ సింగ్​ తోమర్​ (పాన్​ సింగ్​ తోమర్​)

బాలీవుడ్​ నటుడు ఇర్ఫాన్​ఖాన్​ నటించిన అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి. పాన్​ సింగ్​ తోమర్​ వ్యక్తిగత జీవితంతో పాటు జాతీయ స్థాయి అథ్లెట్​గా ఎదగడం​, చంబల్​ వ్యాలీలో అత్యంత అపఖ్యాతి పొందిన దొంగగా ఎలా మారాడన్నదే ఈ చిత్ర కథాంశం. ఈ బయోపిక్​ కోసం పాన్​ సింగ్​ తోమర్​ రూ.15 లక్షలు తీసుకున్నట్లు మిడ్​-డే సర్వే తెలిపింది. అయితే హిందూస్థాన్​ టైమ్స్​ ప్రకారం.. ఈ చిత్ర దర్శకుడిపై తోమర్​ మేనల్లుడు టిగ్మాన్ష్​ ధులియా కేసు నమోదు పెట్టాడట. సినిమా తీసేందుకుగానూ దర్శకుడు, రూ.40 లక్షలు పూర్తిగా చెల్లించలేదని ధులియా ఆరోపించాడు.

paan singh tomar movie
పాన్ సింగ్ తోమర్ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్

5. లక్ష్మీ అగర్వాల్​ (ఛపాక్​)

యాసిడ్​ దాడి బాధితురాలైన లక్ష్మీ అగర్వాల్​.. తన జీవితాధారంగా సినిమాను రూపొందించేందుకు చిత్రబృందం నుంచి రూ.13 లక్షలను తీసుకుందని ఫ్రీ ప్రెస్​ జర్నల్​ సర్వే వెల్లడించింది. మాలతి అని యువతి.. తనపై యాసిడ్​ దాడి జరిగిన తర్వాత న్యాయం కోసం పోరాడటం సహా ఇతర యాసిడ్​ బాధితురాళ్లకు మద్దతుగా న్యాయపోరాటం చేసి భారతదేశంలో యాసిడ్​ అమ్మకాల విషయంలో మార్పులు తీసుకొచ్చింది.

deepika chhapaak
ఛపాక్ మూవీలో దీపిక

6. మిల్కా సింగ్​ (భాగ్ మిల్కా భాగ్​)

మిల్కా సింగ్​ను ఫ్లయింగ్​ సిక్కు అని కూడా పిలుస్తారు. అతడు తన బయోపిక్​ కోసం కేవలం ఒక రూపాయే వసూలు చేశాడని వెల్లడైంది. ఇందులో ఫర్హాన్​ అక్తర్​, సోనమ్​ కపూర్​లు ప్రధానపాత్రల్లో నటించారు. హిందూస్థాన్​ టైమ్స్​ నివేదిక ప్రకారం మిల్కా సింగ్​ మాత్రమే కాకుండా మిగిలిన నటీనటులూ అతి తక్కువ పారితోషికాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని పాత్ర కోసం సోనమ్​ కపూర్​ 11 రూపాయలు రెమ్యూనరేషన్​ తీసుకుంది. మిల్కా సింగ్​ పాత్రలో నటించిన ఫర్హాన్​ అక్తర్​.. "వంద మీటర్ల పరుగు కోసం 11.4 సెకన్లను తీసుకున్నా" అని వెల్లడించాడు. ఒలింపిక్స్​లో మిల్కా సింగ్​ పరుగు పూర్తి చేసిన సమయమిది.

bhaag milkha bhaag movie
భాగ్ మిల్కా భాగ్ మూవీ

7. దంగల్(మహావీర్ సింగ్ ఫొగాట్)

కుస్తీ పోటీల నేపథ్య కథతో బాలీవుడ్​లో రూపొందిన చిత్రం 'దంగల్'. తన కుమార్తెలను మల్లయోధులుగా తయారు చేసి, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా చేసిన మహవీర్ సింగ్ ఫొగాట్ ప్రయాణమే ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమా.. రూ.2000 కోట్ల వసూళ్లు సాధించింది. మహావీర్ పాత్రలో ఆమిర్ మెప్పించారు. అయితే ఈ సినిమా హక్కుల కోసం మహావీర్ సింగ్ ఫొగాట్ రూ.80 లక్షలు తీసుకున్నారట.

dangal movie
దంగల్ మూవీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.