'మిస్టర్ బీన్' అంటే తెలియని టీవీ ప్రేక్షకులు, సినిమా ప్రేక్షకులు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్ని, పెద్దల్ని విపరీతంగా ఆకర్షించిన 'మిస్టర్ బీన్' అసలు పేరు రోవన్ అట్కిన్‌సన్. తెరమీద కమెడియన్‌గా నవ్వులు పంచే ఆయన.. ఓసారి నిజజీవితంలో సమయస్ఫూర్తితో, సాహసవంతంగా ప్రతిస్పందించి 'హీరో' అనిపించుకున్నారు.
2001 మార్చిలో సెలవులను ఆనందంగా గడపడానికి ఓ ప్రైవేటు విమానంలో కెన్యా బయల్దేరారు రోవన్. మంచిగా ప్రయాణం సాగిపోతున్న సమయంలో పైలట్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేసినా విమానం కూలిపోయి ప్రాణాలు పోయే ప్రమాదం జరిగేది. సరిగ్గా అప్పుడు చాకచక్యంగా వ్యవహరించిన 'మిస్టర్ బీన్'.. పైలట్‌ను పక్కకు జరిపి విమానం కంట్రోల్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. గాలిలోనే కొంతసేపు ప్రయాణించేలా చేశారు. కాసేపటికి పైలట్ కోలుకుని.. నైరోబీలోని విల్సన్ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశాడు. దీంతో అందులో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.