*మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి 'దృశ్యం 2' అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల కానుంది. ఫిబ్రవరి 8న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మీనా కథానాయికగా. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.

*సుమంత్ 'కపటధారి' చెప్పిన తేదీ కంటే ముందే థియేటర్లలో సందడి చేయనుంది. ఫిబ్రవరి 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నాజర్, నందితా శ్వేత, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రదీప్ దీనిని తెరకెక్కించారు.

*యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా నటించిన 'పొగరు' చిత్రం.. ఈనెల 19న విడుదలవనుంది. రష్మిక ఇందులో హీరోయిన్. ఇప్పటికే వచ్చిన 'కరాబు' పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

*విజయ్ ఆంటోని 'విజయ్ రాఘవన్' విడుదల తేదీ వెల్లడించారు. రానున్న ఏప్రిల్‌లో థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు చెబుతూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆనంద్ కృష్ణన్ దర్శకత్వం వహించారు.

*మోహన్‌లాల్, పృథ్వీరాజ్, ఆర్య నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ 18' ట్రైలర్, ఆది-సురభి 'శశి' సినిమాలో 'దీంథానా దీంథానా' లిరికల్ గీతం శుక్రవారం విడుదలయ్యాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: