*'బ్రహ్మాస్త్ర'లో తన పాత్ర చిత్రీకరణ పూర్తయిందని కింగ్ నాగార్జున వెల్లడించారు. రణ్బీర్, ఆలియాతో కలిసి నటించడం అద్భుత అనుభవమని పేర్కొన్నారు. ఈ సినిమాలో అమితాబ్ కూడా ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకుడు.

*కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన 'రాబర్ట్' సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటున్నాయి. వచ్చే నెల 11న థియేటర్లలో చిత్రం రిలీజ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*శ్రీవిష్ణు, కేథరిన్ జంటగా నటిస్తున్న 'భళా తందనాన' షూటింగ్ ప్రారంభమైంది. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. చైతన్య దంతులూరి దర్శకుడు. వారాహి చలనచిత్రం పతాకంపై సాయికొర్రపాటి నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*జాన్వీ కపూర్ నటిస్తున్న హారర్ చిత్రం 'రూహీ' కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది. మార్చి 11న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హార్దిక్ మెహతా దర్శకత్వం వహించారు.

ఇవీ చదవండి: