ETV Bharat / sitara

THEATRES NEWS: ఏపీలో థియేటర్లు ఓపెన్.. తెలంగాణలో?

లాక్​డౌన్ కారణంగా మూతపడిన థియేటర్లు తెరుచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతిచ్చింది. 50 శాతం సామర్ధ్యంతో సినిమా హాళ్లను నడిపించొచ్చని పేర్కొంది. తెలంగాణలోనే థియేటర్లపై మరో మరో రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

MOVIE THEATRES OPEN TELUGU STATES FROM JULY 8
థియేటర్లు ఓపెన్
author img

By

Published : Jul 5, 2021, 4:08 PM IST

సినిమా ప్రియులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వల్ల మూతపడ్డ థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 50 శాతం సామర్ధ్యంతో జులై 8వ తేదీ నుంచి థియేటర్లు నడిపించవచ్చని ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సినిమా చిత్రీకరణలు, నిర్మాణానంతర కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మళ్లీ జోరందుకుంటున్నాయి. ఇప్పుడు ఏపీలో థియేటర్లకు అనుమతి రావడం వల్ల దర్శకనిర్మాతలు విడుదల తేదీలపై సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇచ్చినా, ఎప్పటి నుంచి ప్రదర్శనలు మొదలు పెట్టాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.

MOVIE THEATRES OPEN TELUGU STATES FROM JULY 8
సినిమా థియేటర్

మరోవైపు తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌లో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ నిర్ణయించింది. ఈ నెల 7న హైదరాబాద్‌లోని తెలుగు ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ కాన్ఫరెన్స్‌ హాల్ రామానాయుడు బిల్డింగ్‌లో ఈ సమావేశం జరగనుంది. ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నిర్మాతలు.. ఈ ఏడాది అక్టోబరు వరకూ వేచి చూడాలని, అప్పటికీ థియేటర్లు తెరవకపోతే వారి ఆలోచనల ప్రకారం ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని ఇటీవల జరిగిన సమావేశం సందర్భంగా తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ కోరింది. నిర్మాతల మండలి నిర్ణయాన్ని కాదని ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తే తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం థియేటర్లకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో బుధవారం జరగబోయే సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.