బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించాలని ఎవరికుండదు చెప్పండి. కానీ దీపికా పదుకునే మాత్రం భాయ్‌తో కలిసి ఒక్క సినిమా అయినా చేయలేదు. ఈ విషయంపై సల్మాన్ స్పందిస్తూ .. ‘"తన పక్కన ఇంతవరకు నన్నెవరూ తీసుకోలేదు మరి. ఎందుకంటే దీపిక పెద్ద స్టార్. నాతో సినిమా చేయాలంటే ఆమెకు సమయం ఉండాలిగా" అని అన్నాడు.
ఇప్పటికైతే దీపిక హీరోయిన్గా, తాను హీరోగా సినిమా వచ్చే అవకాశం లేదని సల్మాన్ స్పష్టం చేశాడు. ఎందుకంటే... "నా తర్వాతి సినిమాల్లో కత్రినా, సోనాక్షి, జాక్వెలీన్‌లు నాయికలుగా నటిస్తున్నారు. కాబట్టి నా తర్వాతి మూడు చిత్రాలు అయ్యాకే దీపికతో కలిసి చేసే అవకాశం ఉంటుందేమో చూడాలి’’ అన్నాడు.
దీపికకు ఆమె చిన్నతనంలోనే తన సినిమాలో అవకాశమిచ్చాడట సల్మాన్. కానీ, అప్పటికి ఆమెకు కెమెరా ముందుకొచ్చి నిలబడే వయసు లేనందున ఆ అవకాశం చేజారిందట. ఈ విషయాన్ని దీపికే ఓ ఇంటర్యూలో చెప్పింది.
ఇవీ చూడండి..కొత్త సినిమాలో కల్యాణ్ రామ్ 'డ్యూయల్ రోల్'