ETV Bharat / sitara

మెగాస్టార్ 'ఆచార్య'లో కలెక్షన్ కింగ్ మోహన్​బాబు! - సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'లోని కీలక పాత్ర కోసం నటుడు మోహన్​బాబును సంప్రదించారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది.

Mohanbabu in Chiru Acharya movie dircted by Koratala Siva
ఒకే తెరపై చిరంజీవి-మోహన్​బాబు!
author img

By

Published : Apr 18, 2020, 4:06 PM IST

మెగాస్టార్ చిరంజీవి- కలెక్షన్ కింగ్ మోహన్​బాబు మళ్లీ కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ కాంబినేషన్​లో గతంలో వచ్చిన 'కొదమసింహం', 'లంకేశ్వరుడు' చిత్రాలు.. ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ 'ఆచార్య' కోసం కలిసి పనిచేయనుండటంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది​.

ఈ విషయమై మెహన్‌బాబును చిరు సంప్రదించగా... ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో అయితేనే తాను నటిస్తానని కలెక్షన్ కింగ్ చెప్పారట. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. ఈ సినిమాలో రామ్​చరణ్‌.. ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు ఇటీవలే చిరు వెల్లడించారు.

ప్రస్తుతం 40 శాతంకు పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుందీ సినిమా. ఇందులో కాజల్​ అగర్వాల్ హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి : దర్శకధీరుడు రాజమౌళి తర్వాతి సినిమా మహేశ్​తో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.