ETV Bharat / sitara

'అక్షర సినిమా సమాజంలో స్ఫూర్తి నింపాలి' - నందితా శ్వేత

హైదరాబాద్​లో నిర్వహించిన అక్షర సినిమా ముందస్తు వేడుకకు ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. సినిమా విజయవతం అవటమే కాకుండా... సమాజంలో స్ఫూర్తి నింపాలని ఆమె ఆకాంక్షించారు. నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించగా... చిన్నికృష్ణ దరక్శత్వం వహించిన అక్షర ఈ నెల 26న విడుదల కాబోతుంది.

mlc kavitha attended for akshara movie pre relese function

author img

By

Published : Feb 24, 2021, 12:26 PM IST

తెలుగు రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు, నాయకుల్లో 'అక్షర' చిత్రం స్ఫూర్తి నింపాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. చదువుల్లో ఒత్తిడి భరించలేక అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కవిత... సినిమా మాధ్యమం ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు.

అక్షర సినిమా విద్యావ్యవస్థలో మార్పు తీసుకువస్తుందని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించగా... చిన్నికృష్ణ దరక్శత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 26న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్​లో ముందస్తు విడుదల వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కవితతోపాటు యువ కథానాయకుడు సాయిధరమ్​తేజ హాజరై... విద్యావ్యవస్థలో మార్పు కోసం తీసిన అక్షర చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: కొత్త పింఛన్ల అంశంపై బడ్జెట్లో స్పష్టత...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.