కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించినప్పటి నుంచి సినీ సందడి మూగబోయింది. షూటింగ్‌లు నిలిచిపోయి... థియేటర్లకు తాళం పడింది. అయితే ఇటీవల న్యూజిలాండ్ దేశం కొవిడ్‌పై విజయం సాధించడం వల్ల అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా షూటింగ్‌లు, థియేటర్లలో చిత్రాలు విడుదలవుతున్నాయి. కరోనా విరామం తర్వాత అక్కడ మొదటిసారిగా విడుదలైన చిత్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు నిర్మించిన చిత్రం 'మిస్టేక్ ఏక్ గల్తీ' కావడం విశేషం.
ఈ చిత్రాన్ని తెలంగాణకు చెందిన తుక్కాపురం సంతోష్, దేవరకొండ వికాస్ నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడిగా సంతోష్, ఎడిటర్‌గా వికాశ్ పనితీరు ఆకట్టుకుంది.
జూన్ 13న విడుదలైన ప్రీమియర్‌కి అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆర్జే నసిర్ ఎం ఖాన్, యోష్ణా సింగ్ నటించిన ఈ చిత్రాన్ని ఆదేశ పార్లమెంటరియన్స్ చూశారు. చిత్ర దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి... మాస్క్‌తో రానా-మిహీక ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్