కృతి సనన్.. బాలీవుడ్లో 'లుకాచుప్పి'తో ఈ ఏడాది మంచి విజయాన్ని అందుకుంది. ఇందులోని ముఖ్య పాత్రలో పంకజ్ త్రిపాఠి నటించాడు. ఆ సినిమాను దర్శకత్వం వహించిన లక్ష్మణ్ ఉటేకర్‌తో.. వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ డైరక్టర్ తీస్తున్న 'మిమి'లో నటిస్తున్నారు.
మరాఠి సినిమా 'మలా ఆయి వ్యహచాయ్' ఆధారంగా రూపొందుతోందీ చిత్రం. సరోగసి(అద్దెగర్భం) నేపథ్య కథాంశంతో ఈ చిత్రం తీస్తున్నారు. ఇదే కాన్సెప్ట్‌తో తెలుగులో 'వెలకమ్ ఒబామా'(2013) అనే సినిమా వచ్చింది.
ఇవీ చూడండి.. రన్నింగ్ ట్రాక్‌పై దూసుకెళ్తోన్న తాప్సీ