Chiranjeevi: రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ సినీనటుడు చిరంజీవి స్పష్టం చేశారు. చిరంజీవికి వైకాపా రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమేనని, వాటిని ఖండిస్తున్నట్టు చెప్పారు.
రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, వాటిని కోరుకోనని తెలిపారు. పదవులు కోరుకోవడం తన అభిమతం కాదని చిరంజీవి వెల్లడించారు. సినీ పరిశ్రమకు చెందిన సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి గురువారం మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దీంతో చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు ప్రచారం జరిగింది.
నాకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు ఊహాజనితమే. రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలను ఖండిస్తున్నా. అలాంటి ఆఫర్లు నా వద్దకు రావు. రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు ఆఫర్లు ఎవరూ ఇవ్వరు. అలాంటి ఆఫర్లకు లోబడే వ్యక్తిని కాను. పదవులను కోరుకోవడం నా అభిమతం కాదు. -చిరంజీవి
ఆ భేటీకి రాజకీయ రంగు పులిమారు...
రాజ్యసభ ఆఫర్ ఊహాగానాలపై స్పందించిన చిరంజీవి.. ట్విట్టర్‌లో స్పష్టతనిచ్చారు. సినీ పరిశ్రమ మేలు కోసం ఏపీ సీఎంతో చర్చించానని వెల్లడించారు. జగన్‌తో చర్చలను పక్కదోవ పట్టించేలా వార్తలొచ్చాయాని ఆయన మండిపడ్డారు. ఏపీ సీఎంతో భేటీకి రాజకీయరంగు పులిమారన్న చిరంజీవి.. తనను రాజ్యసభకు పంపుతున్నట్లు తప్పుడు ప్రచారం చేశారని ట్వీట్లో తెలిపారు.
ఆ వార్తలు పూర్తిగా నిరాధారం
తనను రాజ్యసభకు పంపుతున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమని చిరంజీవి కొట్టిపడేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని మరోసారి పేర్కొన్నారు. తాను మళ్లీ రాజకీయాలు, చట్టసభలకు రావటం జరగదన్న మెగాస్టార్.. ఈ ఊహాగానాలకు పులిస్టాప్ పెట్టాలని కోరుతున్నానన్నారు.
ఇదీ చదవండి: