బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌ను 2021కి గానూ ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐఏఎఫ్ అవార్డు వరించింది. మార్చి 19న వర్చువల్‌గా ప్రముఖ హాలీవుడ్ దర్శకులు మార్టిన్ స్కోర్సెస్, క్రిస్టోఫర్ నోలన్ ఈ పురస్కారాన్ని బిగ్‌బీకి ప్రదానం చేస్తారు.
భారత చిత్రసీమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించినందుకు ఈ అవార్డును బిగ్‌బీకి అందిస్తున్నట్లు తెలిపారు క్రిస్టోఫర్. ఈ ఘనతను అందుకోవడంపై అమితాబ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన.. 'మేడే', 'ఝండ్', 'బ్రహ్మాస్త్ర', 'చెహ్రే' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి: పరిణీతి సినిమా ట్రైలర్.. 'చెహ్రే' టీజర్ రిలీజ్ డేట్