మాస్ మహారాజ్ కొత్త చిత్ర దర్శకుడు ఎవరు? - క్రాక్ సినిమా
'క్రాక్' సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు మాస్ మహారాజ్ రవితేజ. దీని తర్వాత ఆయనతో సినిమా తీసేందుకు ముగ్గురు దర్శకులు వేచి ఉన్నారట. అయితే ఆ జాబితాలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో తెలియాల్సి ఉంది.
![మాస్ మహారాజ్ కొత్త చిత్ర దర్శకుడు ఎవరు? Maruthi's Film With Ravi Teja: Uncertainty Over The Project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8803622-635-8803622-1600132614454.jpg?imwidth=3840)
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు హీరో రవితేజ. ప్రస్తుతం ఆయన చేస్తున్న 'క్రాక్' చిత్రం సెట్స్‌పై ఉండగానే.. పలువురు దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేసి ఉంచారు. ఈ జాబితాలో నక్కిన త్రినాథరావు, రమేశ్ వర్మ, వక్కంతం వంశీ లాంటి వారితోపాటు దర్శకుడు మారుతి కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడీ దర్శకుల్లో రవితేజ ముందుగా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
![Maruthi's Film With Ravi Teja: Uncertainty Over The Project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8803622_2.jpg)
వాస్తవానికి 'క్రాక్' తర్వాత రవితేజ.. రమేశ్ వర్మ చిత్రంతోనే సెట్స్‌పైకి వెళ్తారని వార్తలొచ్చాయి. ఆయన ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి పెట్టారు. ఇప్పుడీ ప్రణాళికలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. పరిస్థితుల్ని బట్టి నక్కిన త్రినాథరావు, వక్కంతం కథల్లో ఏదొకటి ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ముందుగా ఎవరి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందనేది తెలియాల్సి ఉంది.
కొత్తలుక్‌తో 'క్రాక్' పుట్టించేలా..
'క్రాక్' సెట్స్‌లోని ఆసక్తికర చిత్రాలను ఇన్‌స్టాలో పంచుకున్నారు రవితేజ. వీటిలో ఆయన సముద్రం ఒడ్డున గొడుగు పట్టుకొని కళ్లజోడు, అదిరిపోయే డ్రెస్సింగ్ స్టైల్‌తో క్లాస్‌గా నడిచొస్తూ దర్శనమిచ్చారు. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న చిత్రమిది.
![Maruthi's Film With Ravi Teja: Uncertainty Over The Project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8803622_3.jpg)