ETV Bharat / sitara

మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు - mahesh babu

ప్రిన్స్​ మహేశ్ బాబు అందాన్ని తెగ పొగిడేస్తున్నాడు హీరో మంచు విష్ణు. ఆ అందానికి కారణమేంటో కూడా చెప్పాడు. అదేంటో మీరూ తెలుసుకోండి.

manchu vishnu reveals secret behind mahesh's beauty
మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
author img

By

Published : Jan 16, 2021, 7:30 PM IST

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా..? కేవలం అభిమానులే కాదు.. తన సహనటులతో పాటు దక్షిణాది.. ఉత్తరాది సినీ ప్రముఖులు కూడా మహేశ్‌బాబు అందానికి ఫిదా అయినవాళ్లే. మంచితనాన్ని కొనియాడినవాళ్లే. తాజాగా మహేశ్‌బాబుపై హీరో మంచు విష్ణు ప్రశంసలు కురిపించాడు. విష్ణు సతీమణి వెరొనికా జన్మదిన వేడుకల్లో మహేశ్‌ తన సతీమణి నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్నాడు విష్ణు.

"ఈ ఫొటోలో ఉన్న ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ యువకుడిలా మారుతూ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. ఆయన మంచితనమే దానికి ప్రధాన కారణమని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని విష్ణు ఆ పోస్టులో పేర్కొన్నాడు.

దీనిపై సూపర్‌స్టార్‌ స్పందించాడు. "ఇంతమంచి ఆతిధ్యమిచ్చినందుకు ధన్యవాదాలు" అంటూ ట్వీట్‌ చేశాడు.

ప్రస్తుతం మహేశ్‌బాబు 'సర్కారువారి పాట'లో నటిస్తున్నాడు. ఆ సినిమా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మంచు విష్ణు నటిస్తున్న 'మోసగాళ్లు' అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి: విజయ్ సేతుపతి మూకీ సినిమా.. పోస్టర్ రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.