ETV Bharat / sitara

'ఢీ' కంటే బెటర్‌ ఏముంది: మంచు విష్ణు

టాలీవుడ్​ హీరో మంచు విష్ణు, దర్శకుడు శ్రీనువైట్ల కాంబోలో భారీ హిట్టయిన చిత్రం 'ఢీ'. ఈ సినిమా దాదాపు 13 ఏళ్లకు మళ్లీ సీక్వెల్​గా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ విషయాన్ని విష్ణు అధికారికంగా నవంబర్​ 23న ప్రకటించనున్నారు.

manchu news
'ఢీ' కంటే బెటర్‌ ఏముంది: మంచు విష్ణు
author img

By

Published : Nov 20, 2020, 8:36 PM IST

'ఢీ'.. మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం. విష్ణు, జెనీలియా, శ్రీహరి నటనతోపాటు బ్రహ్మానందం, సునీల్‌ కామెడీ టైమింగ్‌ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2007లో వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే త్వరలో 'ఢీ' చిత్రానికి సీక్వెల్‌ రానున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచువిష్ణు చేసిన ఓ ట్వీట్‌తో 'ఢీ' సీక్వెల్‌ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

"కొన్ని వేలమంది సినీప్రియుల అభిమాన చిత్రం 'ఢీ'. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క నటీనటుడికి ఇది ఒక గేమ్‌ఛేంజర్‌. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన ఓ సరికొత్త ఒరవడికి 'ఢీ' శ్రీకారం చుట్టింది. 'ఢీ' కంటే బెటర్‌ ఏమి ఉంటుంది?" అని విష్ణు పేర్కొన్నారు. అంతేకాకుండా నవంబర్‌ 23న ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వివరించారు. దీంతో నెటిజన్లు 'ఢీ' సీక్వెల్‌ గురించే విష్ణు ప్రకటించనున్నారని చెప్పుకొంటున్నారు.

  • ‘Dhee’ one of the fav film for thousands of movie lovers. This film was a game changer for the entire cast and crew. It gave wave to a whole new slate of movies at that time. What could be better than ‘Dhee’ 🤔🤩? pic.twitter.com/qluJwI7Gc3

    — Vishnu Manchu (@iVishnuManchu) November 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం 'మోసగాళ్లు' చిత్రంలో మంచువిష్ణు నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌, సునీల్‌శెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.