ETV Bharat / sitara

డబ్బు కోసం 'మేజర్'​ సినిమా చేయలేదు: అడివి శేష్‌

author img

By

Published : Apr 12, 2021, 6:08 PM IST

డబ్బు కోసం 'మేజర్'​ సినిమా తీయలేదని అన్నారు యువ హీరో అడివి శేష్​. 2008లో ముంబయి దాడుల్లో చనిపోయిన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ ఫొటోలు చూసినప్పుడు తన సొంత అన్నయ్యను కోల్పోయినట్లు అనిపించిందని చెప్పారు. ఈ చిత్రం ఎంతో మంది హృదయాలను తాకుతుందని చెప్పుకొచ్చారు.

major
మేజర్​

'మేజర్‌' కేవలం డబ్బు కోసం చేసిన సినిమా కాదని కథానాయకుడు అడివి శేష్‌ స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదుల ముంబయి దాడుల్లో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ అమరుడైనప్పుడు తన సొంత అన్నయ్యను కోల్పోయినట్లు అనిపించిందని చెప్పారు. మేజర్‌ సందీప్‌ జీవితకథ ఆధారంగా శశికిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అడివి శేష్‌ ప్రధానపాత్ర పోషించారు. తాజాగా చిత్రబృందం టీజర్‌ విడుదల కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్‌ మాట్లాడారు.

"2008లో ముంబయి దాడులు జరిగినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. ఆ దాడుల్లో చనిపోయిన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ ఫొటోలు చూసినప్పుడు నా సొంత అన్నయ్యను కోల్పోయినట్లు అనిపించింది. అప్పుడే ఆయనపై సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఆయన తల్లిదండ్రులతో మాట్లాడాను. వాళ్లు కూడా అంత సులభంగా ఈ సినిమాకు ఒప్పుకోలేదు. మొత్తానికి ఎంతో కృష్టపడి వాళ్లను ఒప్పించాం. సినిమా తీసేందుకు మాకు అనుమతి ఇచ్చిన సందీప్‌ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. వాళ్లే ఈ సినిమాకు మొదటి ప్రేక్షకు" అని ఆయన పేర్కొన్నారు.

"డబ్బు సంపాదించాలన్న ఆశతో తీసిన సినిమా కాదిది. ఎంతో కష్టపడి పనిచేశాం అని చెప్పను.. కానీ.. మనస్ఫూర్తిగా ఎంతో జాగ్రత్తగా చేశాం. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు బాక్సాఫీస్‌వంటి పదాలు వాడదలుచుకోలేదు. ఎంతో మంది హృదయాలను తాకే చిత్రం ఇది. మనసున్న మనిషికి నచ్చే సినిమా ఇది. ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినందుకు నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. కోహినూర్‌ వజ్రాన్ని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అమ్మితే నకిలీ అనుకొని ఎవరూ కొనరు. అదే ఒక మంచి జ్యువెల్లరీ షాపులో పెడితే వేల కోట్ల రూపాయలు పెట్టేందుకు సిద్ధమవుతారు. ఇక్కడ ప్లాట్‌ఫామ్‌ అనేది చాలా ముఖ్యం. మా సినిమా కోహినూర్‌ వజ్రమయితే.. మహేశ్‌బాబుగారి బ్యానర్‌ ప్లాట్‌ఫామ్‌. ‘మేజర్‌’ను ఆయన ఎక్కడితో తీసుకెళ్లారు. ఈ సినిమా కోసం టెక్నీషియన్లు బాగా పనిచేశారు" అని అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: టీజర్​: సోల్జర్​గా​ ఎందుకు అవ్వాలనుకుంటారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.