తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ప్రిన్స్ మహేశ్‌బాబు మద్దతు తెలిపాడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ జ్వరాల బారిన పడే వారిసంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కొన్ని సూచనలు చేశారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
" వైరల్ జ్వరాలు, డెంగీ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాను. మీరూ ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి" -కేటీఆర్, పురపాలకశాఖ మంత్రి
కేటీఆర్ ట్వీట్‌కు టాలీవుడ్ కథానాయకుడు ప్రిన్స్ మహేశ్‌బాబు.. సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపాడు.
-
Dengue & viral fever has become an epidemic in the city. Do an extra bit in keeping your premises & neighborhood free from water stagnation. Be vigilant & take care of yourself, Hyderabad. https://t.co/R3IRomAQjN
— Mahesh Babu (@urstrulyMahesh) September 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dengue & viral fever has become an epidemic in the city. Do an extra bit in keeping your premises & neighborhood free from water stagnation. Be vigilant & take care of yourself, Hyderabad. https://t.co/R3IRomAQjN
— Mahesh Babu (@urstrulyMahesh) September 10, 2019Dengue & viral fever has become an epidemic in the city. Do an extra bit in keeping your premises & neighborhood free from water stagnation. Be vigilant & take care of yourself, Hyderabad. https://t.co/R3IRomAQjN
— Mahesh Babu (@urstrulyMahesh) September 10, 2019
" హైదరాబాద్ నగరవాసులరా... ప్రస్తుతం డెంగీ, వైరల్ జ్వరాలు నగరంలో బాగా వ్యాపిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి. అప్రమత్తంగా ఉండి ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి" -మహేశ్‌బాబు, సినీ నటుడు
పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందుకోసం ప్రజల భాగస్వామ్యం అవసరమని చెప్పారు టాలీవుడ్ హీరోలు ప్రభాస్, వెంకటేశ్.
ఇవీ చదవండి...