ప్రముఖ నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ క్యాన్సర్ బారి నుంచి కోలుకున్నారు. హీరో సల్మాన్‌ఖాన్‌తో ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలోనే మహేశ్ ఈ విషయాన్ని తెలిపారు.

"అంతిమ్ చిత్ర షూటింగ్ సమయంలో నేను క్యాన్సర్ బారిన పడ్డాను. నాకు ఈ విషయం తెలియగానే షాక్ అవ్వలేదు. దాన్ని అంగీకరించాను. చాలా మంది ఈ రోగంతో బాధపడుతున్నారు. దానితో పోరాడుతూ జీవనం సాగిస్తున్నారు. నా మీద అది పెద్దగా ప్రభావం చూపలేదు. కీమోథెరపీ చికిత్స తీసుకుంటూనే చిత్రీకరణను పూర్తి చేశాను. ఈరోజు రోగాన్ని జయించడం చాలా ఆనందంగా ఉంది."
-మహేశ్ మంజ్రేకర్, దర్శకుడు.
హిందీలో 'వాంటెడ్', 'రెడీ', 'ఓ మై గాడ్' సహా ఎన్నో చిత్రాల్లో నటించారు మంజ్రేకర్. 'వాస్తవ్', 'కురుక్షేత్ర', 'నటసామ్రాట్' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు తెరపైనా 'అదుర్స్', 'సాహో' వంటి చిత్రాల్లో కనిపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: అతడిని కొట్టి, తిట్టిన నటుడు మహేశ్ మంజ్రేకర్