తెలుగు హీరోలు ఇద్దరు కలిసి ఓ చోట కనిపిస్తే అభిమానుల ఆనందమే వేరు. తాజాగా మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కలిసి సందడి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి సతీమణి మాలిని పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ తమ భార్యలతో కలిసి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం మహేశ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న 'మహర్షి' చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం మే 9న ముందుకు రానుంది. మరోవైపు ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇద్దరూ తమ పనుల్లో తీరిక లేకుండా ఉన్నా... ఇలా కలవడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.