Vishal madras high court: లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని నటుడు విశాల్‌ను మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అప్పుగా తీసుకున్న రూ.21.29 కోట్లు ఇవ్వకుండా.. 'వీరమే వాగై సుడుం' అనే చిత్రాన్ని విడుదల చేయడానికి, శాటిలైట్, ఓటీటీ హక్కుల విక్రయానికి విశాల్ సిద్ధమయ్యారని, వాటిపై నిషేధం విధించాలని లైకా సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసు విచారించిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి.. రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని విశాల్‌ను ఆదేశించారు. విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.
ఇదీ చూడండి: అఖండ.. యావత్ భారత్‌ను తలెత్తుకునేలా చేసింది: బాలకృష్ణ