ఒకప్పడు సినీతారలు.. చిత్రరంగానికి విరామం తీసుకున్న తర్వాత బుల్లితెరపై పునరామగనం చేసేవాళ్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది వెబ్‌సిరీస్‌ల బాటపడుతూ డిజిటల్ వేదికల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ కూడా చేరింది. నెట్‌ప్లిక్స్ నిర్మించే ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి మాధురి అంగీకరించిందని సమాచారం.
ఇందులో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా కనిపించబోతున్నాడని వార్తలొస్తున్నాయ్. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరికొద్ది రోజుల్లోనే సృష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. నెట్‌ప్లిక్స్‌లో ఇంతకు ముందు హిట్ అయిన 'లస్ట్‌స్టోరీస్' లాగే ఇది కూడా ఓ భిన్నమైన కథాంశానికి చెందిందని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.
ఇదీ చదవండి: 'రానాకు యాక్టింగ్ వచ్చా? రాదా? అని నా అనుమానం'