దేశంలోని ప్రజలు ఒకపక్క కరోనా వైరస్‌తో తీవ్ర భయాందోళనలకు గురవుతుంటే.. మరోపక్క మిడతల దండు (లోకస్ట్ ఎటాక్) వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లోని పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లలో వీటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య కథానాయకుడిగా నటించిన ఓ సినిమా నెట్టింట్లో చర్చనీయాంశమైంది.
-
Watch this #LocustAttack
— Proud Surya Fan | Telugu (@ProudSuryaFan) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Movie Name: #Bandobast aka #Kaappaan #Suriya @Suriya_offl @anavenkat @JaniChiragjani #LocustInvasion #LocustCrisis #LocustUpdate #Locusts #locustswarm pic.twitter.com/bNj5J05T5l
">Watch this #LocustAttack
— Proud Surya Fan | Telugu (@ProudSuryaFan) May 25, 2020
Movie Name: #Bandobast aka #Kaappaan #Suriya @Suriya_offl @anavenkat @JaniChiragjani #LocustInvasion #LocustCrisis #LocustUpdate #Locusts #locustswarm pic.twitter.com/bNj5J05T5lWatch this #LocustAttack
— Proud Surya Fan | Telugu (@ProudSuryaFan) May 25, 2020
Movie Name: #Bandobast aka #Kaappaan #Suriya @Suriya_offl @anavenkat @JaniChiragjani #LocustInvasion #LocustCrisis #LocustUpdate #Locusts #locustswarm pic.twitter.com/bNj5J05T5l
తమిళ నటుడు సూర్య కథానాయకుడిగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బందోబస్త్'. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్‌లాల్, బొమన్ ఇరానీ కీలకపాత్రలో పోషించారు. ఈ సినిమాలోని ద్వితీయార్థంలో బొమన్ ఇరానీ.. ఓ ప్రాంతంలో పంటపొలాలను నాశనం చేసి అక్కడ మైనింగ్ పరిశ్రమను నెలకొల్పడం కోసం మిడతల దండును ప్రయోగిస్తాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉండే పంట పొలాలన్నీ ఒక్కసారిగా మిడతల బారిన పడతాయి. రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన హీరో సమస్యను పరిష్కరిస్తాడు. దీంతో ఆ కథ సుఖాంతమవుతుంది.
కాగా, ప్రస్తుతం మిడతల దండు భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో సృష్టిస్తోన్న అలజడితో 'బందోబస్త్'కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. "లోకస్ట్ ఎటాక్' గురించి సూర్య సినిమాలో గతేడాదే చూపించారు., ప్రస్తుతం మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో దానిని ఓ సంవత్సరం క్రితమే దక్షిణాది సినిమాల్లో చూపించారు" అని కామెంట్లు పెడుతున్నారు.
సూర్య నటించిన '7th సెన్స్' సినిమాలో చూపించిన వైరస్.. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ ఒకేలా ఉందంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. దీంతో మనం ఎదుర్కొంటున్న సమస్యలు సూర్య సినిమాల్లో ముందే చూపించారంటూ కామెంట్లు వస్తున్నాయి.