ETV Bharat / sitara

నీతో మళ్లీ మళ్లీ రొమాన్స్​ చేయాలనుంది కరీనా: ఆమిర్​ - లాల్​ సింగ్​ చద్దా కరీనాకపూర్​ ఫస్ట్​లుక్​

బాలీవుడ్​ స్టార్​ ఆమిర్​ఖాన్​, కరీనాకపూర్​ జంటగా నటిస్తోన్న చిత్రం 'లాల్​ సింగ్​ చద్దా'. ఈ సినిమా తొలిరూపును తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో షేర్​ చేసిన ఆమిర్​.. హీరోయిన్​పై ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.

amir
ప్రేమ కానుకగా 'లాల్​ సింగ్​ చద్దా' ఫస్ట్​లుక్​
author img

By

Published : Feb 15, 2020, 8:45 AM IST

Updated : Mar 1, 2020, 9:39 AM IST

వైవిధ్య నటనకు కేరాఫ్‌ అడ్రస్​గా నిలిచే కథానాయకుడు 'ఆమిర్‌ ఖాన్‌'. తాజాగా అతడు నటిస్తోన్న చిత్రం 'లాల్‌ సింగ్‌ చద్దా'. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అందులో కరీనా కపూర్‌ హీరోను హృదయ పూర్వకంగా హత్తుకున్నట్లు ఉంది. ఆమె ధరించిన దుస్తులు, మేకప్‌తో దేశీ అమ్మాయి లుక్​లో కనిపించింది​. ఇదే ఫొటోను ఆమిర్‌ఖాన్‌ తన ట్విట్టర్లో పోస్ట్​ చేశాడు. ఆ ఫొటోకి 'హ్యాపీ వాలెంటెన్స్‌ డే కరీనా'.. అంటూ ట్యాగ్‌లైన్‌ తగిలించాడు.

"కరీనా... వీలుంటే ప్రతీ సినిమాలో నీతోనే రొమాన్స్‌ చేయాలనుంది. నీతో యాక్ట్‌ చేస్తుంటే రొమాన్స్‌ చాలా సులువుగా వస్తుంది.’’

-ఆమిర్​ ఖాన్​, ట్వీట్​.

  • पा लेने की बेचैनी, और खो देने का डर...
    बस इतना सा है, ज़िंदगी का सफर।#HappyValentinesDay Kareena. I wish I could romance you in every film... comes naturally to me ;-)
    Love.
    a. pic.twitter.com/dafeyspkac

    — Aamir Khan (@aamir_khan) February 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతంలో వీళ్లిద్దరూ 'త్రీ ఇడియట్స్‌', 'తలాష్‌' సినిమాల్లో కలిసి నటించారు. తాజా చిత్రం హాలీవుడ్‌కి చెందిన 'ఫారెస్ట్‌ గంప్‌' సినిమాకు రీమేక్‌. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్, వయా 18 మోషన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం.. డిసెంబర్‌ 25, 2020న క్రిస్మస్‌ పండగ సందర్భంగా తెరపైకి రానుంది. విజయ్‌ సేతుపతి, మోనా సింగ్, దేబాష్‌ ఘోష్‌ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

ఇదీ చదవండి: లవర్స్ డే: టాలీవుడ్​లో ప్రేమికుల సినిమా సందడి

Last Updated : Mar 1, 2020, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.