సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'. గత నెల చివర్లో సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టైటిల్ పోస్టర్ ఆసక్తి రేకెత్తించింది. అయితే ఇందులో హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారా? అని గతకొద్ది రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా దీనికి సమాధానం దొరికేసింది.
'మహానటి'తో జాతీయ అవార్డు దక్కించుకున్న కీర్తిసురేశ్ ఇందులో హీరోయిన్గా నటించనుంది. ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో మాట్లాడుతూ ఈమెనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది.
ఇటీవల మహేశ్ తన అభిమానులతో ఇన్‌స్టా వేదికగా మాట్లాడుతూ.. "సర్కారు వారి పాట' బలమైన సందేశంతో కూడిన ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమా విషయంలో చాలా ఆత్రుతతో ఉన్నా"నని చెప్పారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
ఇది చూడండి : 'సుశాంత్ లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా'