ETV Bharat / sitara

రహస్యంగా విక్కీ-కత్రినా కైఫ్​ రోకా వేడుక! - విక్కీ కౌశల్​ కత్రినా కైఫ్​

బాలీవుడ్​ ప్రేమజంట కత్రినాకైఫ్​, విక్కీకౌశల్​(katrina vicky kaushal) రహస్యంగా రోకా ఫంక్షన్​ చేసుకున్నట్లు తెలిసింది. దీపావళి రోజున వీరిద్దరి కుటుంబాలు కలిసి ఒకే ఇంట్లో సందడి చేశారు(katrina kaif vicky kaushal engaged). డిసెంబర్​లో వీరి వివాహం జరగనున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది.

vicky
విక్కీ కత్రినా
author img

By

Published : Nov 8, 2021, 10:19 AM IST

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్ నటి కత్రినాకైఫ్‌, నటుడు విక్కీకౌశల్‌(katrina vicky kaushal) త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. డిసెంబర్‌ నెలలో వీరి వివాహం జరగనుందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి(katrina kaif vicky kaushal marriage). ఈ క్రమంలో విక్కీ-కత్రినాలకు దీపావళి రోజున సీక్రెట్​గా రోకా ఫంక్షన్‌ జరిగినట్లు సమాచారం(katrina kaif vicky kaushal engaged). కత్రినాకు ఎంతో ఆప్తుడైన దర్శకుడు కబీర్‌ఖాన్‌ నివాసంలో ఈ వేడుక నిర్వహించారట. కత్రినా, ఆమె తల్లి సుజానే టర్కోయెట్, ఇసాబెల్, విక్కీ, ఆయన కుటుంబం ఈ వేడుకలో పాల్గొని.. వివాహానికి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకున్నారట. ఇరు కుటుంబాలు పలు ఖరీదైన బహుమతులను ఇచ్చిపుచ్చుకున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు, ఉత్తర భారతదేశంలో రోకా ఫంక్షన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వధూవరుల కుటుంబసభ్యులు ఒకచోట కలుసుకుని పెళ్లి తంతు, కట్నకానుకలపై మాట్లాడుకుని.. అన్నీ ఓకే అనుకున్నాక స్వీట్స్‌, ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

విక్కీ-కత్రినా(vikcy katrina wedding) కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. కత్రినా అంటే తనకెంతో ఇష్టమని ఇప్పటికే పలు సందర్భాల్లో విక్కీ బయటపెట్టారు. మరోవైపు కత్రినా సైతం విక్కీపై అమితమైన అభిమానాన్ని కనబరిచారు. విక్కీ నటించిన సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: రికీ ఛటర్జీ.. క్వీన్​ ఆఫ్​ ఫ్యాషన్​ ఇండస్ట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.