సాధారణంగా సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ కూడా ఇన్‌స్టాలో అడుగుపెట్టింది. 'కరీనాకపూర్ఖాన్' అనే పేరుతో ఖాతాను తెరిచింది. 'ది క్యాట్స్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్' అనే క్యాప్షన్ జోడించింది. ఖాతా తెరిచిన కొద్ది క్షణాల్లోనే లక్షలమంది ఫాలోవర్లతో జోరు చూపించింది.
నల్ల రంగు కలిగిన పూమా బ్రాండ్ ట్రాక్ సూట్ దుస్తులను ధరించిన ఫొటోను పోస్ట్ చేసింది. ఈ భామ పోజుకు నెటిజన్లు విపరీతంగా 'ఫిదా' అవుతూ, 'ఇన్‌స్టా'కు స్వాగతం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రొఫైల్ పిక్‌గా తన చిన్ననాటి ఫొటోను పెట్టింది.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా.. కరీనా ఖాతా తెరిచిన వెంటనే మొదటగా ఫాలో అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్‌కు స్వాగతం అంటూ పలికాడు.
ప్రస్తుతం 'అంగ్రేజీ మీడియం', 'తఖ్త్', 'లాల్ సింగ్ చద్దా' చిత్రాల్లో నటిస్తోంది కరీనా.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి : ఐఫా వేడుకలు వాయిదా.. కరోనా ప్రభావమే కారణం