ETV Bharat / sitara

నా పిల్లలను సినిమా స్టార్స్​ చేయను: కరీనా కపూర్ - కరీనా కపూర్ వార్తలు

పిల్లల బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా ఉన్న నటి కరీనా కపూర్.. తన కుమారులు సినిమాల్లోకి రావడం గురించి అప్పుడే మాట్లాడింది. వారికిష్టమైన రంగంలో ఉంటే సంతోషిస్తానని తెలిపింది.

kareena kapoor
కరీనా కపూర్
author img

By

Published : Aug 15, 2021, 8:07 PM IST

స్టార్ హీరోయిన్ కరీనా కపూర్​.. సైఫ్ అలీ ఖాన్​ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు తైమూర్(4), జహంగీర్​(6నెలలు)లకు జన్మనిచ్చింది. ఇటీవలే మాతృత్వం గురించి తన అనుభవాలను కలిపి 'ప్రెగ్నెన్సీ బైబిల్'​ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఇటీవల ఓ మ్యాగజైన్​ కవర్ ​ఫోటోషూట్​లో పాల్గొన్న కరీనా.. తన ఇద్దరు పిల్లల గురించి మనకు తెలియని చాలా విషయాల్ని చెప్పింది.

"చిన్నోడికి ఇప్పుడు 6 నెలలు. వాడు అచ్చం నాలాగే ఉంటాడు. కానీ టిమ్(తైమూర్) వాళ్ల నాన్నలా ఉంటాడు. టిమ్​కు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు కొత్తవారిని చూసేందుకు ఇష్టపడేవాడు కాదు. కానీ జహంగీర్​ అలా కాదు. టిమ్​ చాలా క్రియేటివ్​గా ఆలోచిస్తాడు. వాడికి ఆర్ట్​, పెయింటింగ్​, డ్రాయింగ్ అంటే ఇష్టం. అయితే జెహ్​.. ఏం ఇష్టపడతాడో చూడాలి"

"వారికిష్టమైన రంగంలో ఉంటేనే నేను సంతోషిస్తా. వారు సినీతారలు కావాలని నేను కోరుకోవటం లేదు. జీవితంలో ఏవైపు వెళ్లాలన్నది వాళ్ల ఇష్టం. నా తల్లి కూడా నాకు ఆ స్వేచ్ఛనిచ్చింది" అని కరీనా చెప్పుకొచ్చింది. వాళ్లు ఏ రంగంలోనైనా కింద పడి నేర్చుకుంటేనే.. జీవితం అర్థమవుతుందని తెలిపింది.

గతేడాది విడుదలైన 'అంగ్రేజీ మీడియం' చిత్రంలో అలరించింది కరీనా. ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్ధా' సినిమాలో నటిస్తుంది.

ఇవీ చదవండి:

పిల్లాడికి.. డైపర్​ తొడగలేకపోయిన కరీన!

ప్రెగ్నెన్సీ సమయంలో శృంగారం​.. కరీనా ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.