తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. జయ పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించనుంది. నేడు కంగనా పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. హిందీ, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు.
దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో జయలలిత ఒకరు. అందుకే సినిమాలోని ప్రతి విషయం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చిత్రబృందం స్పష్టం చేసింది. జయ పాత్ర దక్కడం చాలా సంతోషంగా ఉందని కంగనా తెలిపింది.
ఇవీ చూడండి..అమెరికా అధ్యక్షుడు ట్రంప్నూ వదలని వర్మ